ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల (Government Medical Colleges) ప్రైవేటీకరణ(Privatisation)ను వ్యతిరేకిస్తూ జరుగుతున్న ప్రజా ఉద్యమం(Public Movement)లో భాగంగా నిర్వహించిన నిరసన ర్యాలీలో వైఎస్ఆర్సీపీ (Ysrcp) రాష్ట్ర అధికార ప్రతినిధి (Spokesperson) ఆరె శ్యామల (Anchor Syamala) పాల్గొన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ (Ys Jagan) పిలుపు మేరకు ఈ కార్యక్రమం జరిగింది.

అద్దంకి (Addanki) నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ఆహ్వానం మేరకు ఆమె ఈరోజు అద్దంకిలో జరిగిన నిరసనలో పాలుపంచుకున్నారు. శ్యామలతోపాటు ఎమ్మెల్సీ (Mlc) తుమ్మటి మాధవరావు, నియోజకవర్గవ్యాప్తంగా వివిధ హోదాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా పాల్గొని విజయవంతం చేశారు.
- Advertisement -
