Monday, January 19, 2026
EPAPER
Homeరంగారెడ్డిJayanti | మేడ్చల్ లో స్వామి వివేకానంద జయంతి వేడుకల్లో పాల్గొన్న

Jayanti | మేడ్చల్ లో స్వామి వివేకానంద జయంతి వేడుకల్లో పాల్గొన్న

  • కాంగ్రెస్ నాయకులు

మేడ్చల్ లో ఉన్న స్వామి వివేకానంద విగ్రహ ప్రతిష్ఠ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వామి వివేకానంద జయంతి వేడుకలల్లో పాల్గొని స్వామి వివేకానంద మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, దేశ యువత స్వామి వివేకానంద ని ఆదర్శంగా తీసుకుని జీవించాలని సూచించారు.భారతదేశాన్ని జాగృతం చేయడమే కాకుండా అమెరికా,ఇంగ్లాండ్ వంటి దేశాలలో యోగ,వేదాంత శాస్త్రాలను తన ఉపన్యాసాలు,వాదనల ద్వారా ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అని తెలిపారు.భారతదేశాన్ని అమితంగా ప్రేమించి,భారతదేశం మళ్లీ తన ప్రాచీన ఔన్నత్యాన్ని పొందాలని ఆకాంక్షించిన మహానుభావుల్లో స్వామి వివేకానంద ముఖ్యుడని అన్నారు.

- Advertisement -

ఆయన వాగ్ధాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానీకం ఆయనకు బ్రహ్మరథం పట్టి,అనేక మంది శిష్యులుగా మారారని చెప్పారు.షికాగోలోనే కాకుండా అమెరికాలోని పలు ప్రాంతాలలో ప్రజల అపారమైన అభిమానాన్ని చూరగొన్నారని వివరించారు.తిరిగి భారతదేశానికి వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించి,దాని ద్వారా భారత యువతకు సరైన దిశా నిర్దేశం చేశారని తెలిపారు.కేవలం 39 ఏళ్ల వయసులోనే పరమపదించినా,ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1984లో స్వామి వివేకానంద జన్మదినాన్ని “జాతీయ యువజన దినోత్సవం”గా ప్రకటించిందని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి,మేడ్చల్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉదండపురం‌ సత్యనారామణ,మేడ్చల్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చీర్ల రమేష్ కురుమ,మేడ్చల్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు బత్తుల శివ కుమార్ యాదవ్,కౌడే మహేష్ కురుమ,రొయ్యపల్లి మల్లేష్ గౌడ్,బత్తుల మధుకర్ యాదవ్,పాలకుర్తి రాఘవేందర్ గౌడ్,నారెడ్డి రవీందర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పంజగారి ఆంజనేయులు,మేకల రాజశేఖర్ రెడ్డి (బబ్లూ),దుబ్బ రామస్వామి ముదిరాజ్,టైలర్ రాజు గౌడ్,వేముల రంజిత్ రెడ్డి,చీర్ల ఆకాష్,గర్ధాస్ నరేందర్,కాలేరు శ్రీకాంత్ వంజరి, స్వామి వివేకానంద విగ్రహ ప్రతిష్ఠ కమిటీ సభ్యులు ఆర్ మల్లికార్జున్ స్వామి,అత్వెల్లి శ్రీ రాములు గౌడ్,టైలర్ రాజు గౌడ్,శివ,దశరథ,ధాత్రిక లక్ష్మణ్,మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,యువకులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News