Monday, April 13, 2026
Homeకరీంనగర్SVJC | ఇంటర్ ఫలితాలలో ఎస్ వి జె సి విద్యార్థుల విజయదుందుభి

SVJC | ఇంటర్ ఫలితాలలో ఎస్ వి జె సి విద్యార్థుల విజయదుందుభి

ఆదివారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాలలో ఎస్ వి జె సి కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజయ బేరి మోగించారు. మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో గుగ్గిళ్ళ గ్రీష్మ 468 సాయి కీర్తన 467 దర్శనాల శివాంజలి 46 దుర్గం దీక్ష 465 నల్ల సింధు 465 శ్రీహర్ష 465 బైపిసి మొదటి సంవత్సరం విభాగంలో ముల్కల ఉమాదేవి 435 హర్షిత 434 అమూల్య 432 సిఇసి విభాగంలో ఈశ్వరవధన్ 490 సిహెచ్ అనూష 489 కొండ దక్షిత 486 మార్కులు సాధించారు

ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో తమన్నా 992 వెన్నెల 992 సహస్ర 989 సిరిపురం వంశీ 989 బుర్ర తనివి 987 మార్కులు పొందగా బైపీసీ విభాగంలో పాగా సహస్ర 994 స్పందన 991 అనికేత్ మిశ్రా 991 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల ( ఎస్ వి జె సి) చైర్మన్ ఊట్కూరి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కార్పొరేట్ స్థాయి విద్యను ప్రాంతీయ విద్యార్థులకు అందించాలనే ఉద్దేశంతో కళాశాలలు నడుస్తున్నాయని ప్రారంభించిన నాటి నుంచి రాష్ట్రస్థాయి ర్యాంకులకు చిహ్నంగా నిలవడం సంతోషంగా ఉందని అన్నారు.

- Advertisement -

విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామని పటిష్టమైన ప్రణాళికతో పాటు నిరంతర పర్యవేక్షణ అధ్యాపకులు అత్యుత్తమ బోధన విద్యార్థుల పట్టుదల అహర్నిశల కృషి ఫలితంగా ఎస్ వి జె సి విద్యార్థులు రాష్ట్రస్థాయి మార్కులు మరియు అత్యుత్తమ ఫలితాలతో విజయం సాధిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో ఎస్ వి జె సి బాలుర క్యాంపస్ ప్రిన్సిపాల్ వరప్రసాద్ బాలికల క్యాంపస్ ప్రిన్సిపాల్ రామిరెడ్డి డైరెక్టర్లు సింహాచలం హరికృష్ణ సంతోష్ రెడ్డి అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News