శివకుమార్ రామచంద్రవరపు, డిబోరా డోరిస్ ఫెల్, రాజశేఖర్ అనింగి, విక్రమాదిత్య డాంబర్ ప్రధాన పాత్ర దారులుగా ప్రశాంత్ నామిని రచన దర్శకత్వంలో తెరకెక్కుతున్న “సువర్ణ టెక్స్టైల్స్ ” ఈ చిత్రం టీజర్ ను ఇటీవలే విడుదల చేశారు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎ.వై.వి.ప్రొడక్షన్స్, సనాతన క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మాత అనిల్ ఈరుగుదిండ్ల నిర్మిస్తున్నారు. ఆదివారం ప్రసాద్ ల్యాబ్ లో దర్శకుడు వేణు ఉడుగుల ఈ చిత్రం టీజర్ ను రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా… హీరో శివకుమార్ మాట్లాడుతూ… ప్రస్తుతం ఎన్టీఆర్ తో కలిసి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ లో చేస్తున్నా… కచ్చితంగా 2 వేల కోట్లు కలెక్ట్ చేస్తాడు.. చూసారుగా తారక్ గారు ఎలా సన్నబడి ఎడారి లో కళ్లజోడు పెట్టుకొని నడుస్తుంటే తారక్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాడు.. ఈ సినిమా విషయానికి వస్తే.. హైటెక్ సిటీ వీధుల్లో నైటీ వేసుకుని పరిగెత్తించాడు. మంచి జీల్ ఉన్న దర్శకుడు ప్రశాంత్ నామిని. ఎంతో ప్యాషన్ తో సినిమా తీశాడు. కచ్చితంగా నచ్చుతుంది. యూత్ కు బాగా నచ్చుతుంది. టీజర్ చూసారుగా ఎవరిని డిజప్పాయింట్ అయితే చేయదు అన్నారు.

దర్శకుడు వేణు ఉడుగుల మాట్లాడుతూ… టీజర్ చాలా బాగుంది. టీజర్ ఎలా ఉందో సినిమా కూడా అలానే తీస్తే మాత్రం అందరూ మాట్లాడుకునే సినిమా అవుతుంది. ఈ సినిమాతో ప్రశాంత్నామిని ఓ మంచి దర్శకుడు అవుతాడు అన్నారు.
హీరో సోహైల్ మాట్లాడుతూ… ప్రశాంత్ నాకు ఎప్పటి నుంచో పరిచయం. ఫస్ట్ ఈ కథని నాకే చెప్పాడు. అయితే నాకే ఈ జోనర్ చేయాలంటే ధైర్యం చాలలేదు. ఈ టీజర్ చూస్తుంటే యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా వుంది. ఆల్ ది బెస్ట్ ప్రశాంత్ నామిని అన్నారు.
దర్శకుడు ప్రశాంత్ నామిని మాట్లాడుతూ… ఇదొక కొత్త జానర్. కొంత అడల్ట్ కంటెంట్ ఉన్నా… ఫ్యామిలీ తో కలిసి చూడదగ్గ సినిమా ఇది అని ముగించారు.
ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత అనిల్ ఈరుగుదిండ్ల, నటుడు లోబో తదితరులు పాల్గొన్నారు.
సాంకేతిక నిపుణులు:
రచన, దర్శకత్వం: ప్రశాంత్ నామిని
నిర్మాత: అనీల్ ఈరుగుదిండ్ల
సినిమాటోగ్రఫీ: చందు ఎ.జె
సంగీతం: భరత్ M
ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి
ఆర్ట్: విజయ్ కుమార్ గాజుల
లిరిక్స్: రాంబాబు గోసల
PRO: దుద్ది శ్రీను
