Monday, October 27, 2025
ePaper
Homeరంగారెడ్డిDrainage | డ్రైనేజీ పనులపై సుతారిగూడవాసుల ఆందోళన

Drainage | డ్రైనేజీ పనులపై సుతారిగూడవాసుల ఆందోళన

గుండ్లపోచంపల్లి మునిసిపాలిటీ పరిధిలోని..
కండ్లకోయలో చేపడుతున్న పైపులైను పనులపై..
వెల్లువెత్తుతున్న విమర్శలు

మేడ్చల్: గుండ్లపోచంపల్లి మునిసిపాలిటీ (Gundlapochampally Municipality) పరిధిలోని కండ్లకోయ(Kandlakoya)లో చేపడుతున్న డ్రైనేజీ పైపులైను (Drinage Pipe Line) పనులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పనులను ఎవరి లాభం కోసం చేస్తున్నారంటూ సుతారిగూడవాసులు (Suthariguda) ప్రశ్నిస్తున్నారు. ఈ డ్రైనేజీ నిర్మాణం వల్ల తమ చెరువులో డ్రైనేజ్ వాటర్ కలిసి దుర్వాసన(Bad Smell)తోపాటు దోమలు (Mosquitoes) వ్యాప్తి చెంది ప్రజలు రోగాల (Diseases) బారిన పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కండ్లకోయలోని బొడ్రాయి వద్ద నుంచి కండ్లకోయ చెరువులోని ఔట్ ఫ్లో (OutFlow) వరకు డ్రైనేజీ పనులు సాగుతున్నాయి.

ఈ డ్రైనేజ్ పైప్ లైన్‌ను కండ్లకోయ గ్రామంలోని బొడ్రాయి నుంచి ఏర్పాటు చేసి కండ్లకోయ చెరువు ఔట్ ఫ్లోకు కలపడం వల్ల డ్రైనేజ్ నీరంతా సుతారిగూడ చెరువులో కలుస్తుంది. ఇప్పటికే కండ్లకోయ చెరువు ఔట్ ఫ్లో నుంచి డ్రైనేజ్ నీరు సుతారిగూడ చెరువులో కలవడం వల్ల చెరువు కలుషితమైంది. దీంతో దుర్వాసన, దోమలు వ్యాప్తి చెంది చెరువు పక్కనే ఉన్న సుతారి గ్రామవాసులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. దోమల వల్ల మలేరియా(Malaria), డెంగీ(dengue), టైఫాయిడ్(typhoid) వంటి రోగాలు వస్తున్నాయి. ఇది చాలదన్నట్లు మళ్లీ కండ్లకోయలోని బొడ్రాయి నుంచి కండ్లకోయ చెరువు ఔట్ ఫ్లోకు డ్రైనేజీ పైప్ లైన్ కలపడం వల్ల డ్రైనేజీ నీరంతా సుతారిగూడ చెరువులోకి వచ్చి చేరుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే సుతారిగూడ చెరువు పక్కనే ఉన్న సీఎంఆర్ కళాశాల(CMR College)తోపాటు హాస్టల్ డ్రైనేజ్ నీరు, కండ్లకోయ గ్రామ డ్రైనేజ్ నీరు సుతారిగూడ చెరువులోకి వచ్చి చేరుతోంది. సీఎంఆర్ కళాశాల, హాస్టల్ నుంచి వచ్చే డ్రైనేజ్ నీటిని ఫిల్టర్ చేసి సుతారిగూడ చెరువులోకి కలపాలని డిమాండ్లు ఉన్నప్పటికీ ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఇప్పటికే ఉన్నాయి. తాజాగా కండ్లకోయ నుంచి డ్రైనేజీ నీటిని సుతారిగూడ చెరువులోకి కలపడాన్ని ఆ గ్రామ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News