- ఉత్తర్వులు జారీ చేసిన డిఈఓ డా.శ్రీజ
పాఠశాల విద్యార్థినీలకు విద్యాబోధన చేయకుండా,తాకరాని చోట తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించిన కీచక ఉపాధ్యాయుడు పై విద్యాశాఖ అధికారులు ఎట్టకేలకు చర్యలు తీసుకున్నారు.కూసుమంచి మండలంలోని నరసింహులగూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో జి.వీరయ్య అనే ఉపాధ్యాయుడు వికృత చేష్టలతో విద్యార్థినీల పై లైంగిక వేధింపులకు పాల్పడిన విషయాన్ని అక్టోబరు 19 న ఆదాబ్ హైదరాబాద్ దినపత్రిక వెలుగులోకి తీసుకువచ్చింది.విద్యార్థినీల పై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులు అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి జిల్లా విద్యాశాఖ అధికారిణి డా.శ్రీజ స్పందించి,విచారణ చేపట్టి సదరు ఉపాధ్యాయుడు జి.వీరయ్య పై సస్పెన్షన్ వేటు వేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్భంగా విధ్యార్థులు,తల్లితండ్రులు,సామాజిక కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ ఆదాబ్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.

