ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్‌కు సంబంధించి కొన్ని విషయాల్లో ఉత్కంఠ(Suspense) కొనసాగుతోంది. బంగ్లాదేశ్(Bangladesh) ఇండియా(India)లో ఆడుతుందా లేదా అనేది ఇంకా ఖరారు కాలేదు. ఐసీసీ కూడా క్లారిటీ(No Clariry From ICC) ఇవ్వలేదు. టోర్నీ మొదలుకావటానికి ఎక్కువ వ్యవధి లేనందున బంగ్లాదేశ్ కోరుతున్నట్లు వేదికలను మార్చటం కుదరదేమోననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. ఐసీసీ త్వరలో బంగ్లాదేశ్‌లో పర్యటించి అక్కడి క్రికెట్ బోర్డ్‌తో భేటీ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుతో చర్చించాకే వేదికల మార్పునకు సంబంధించి తుది నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. లేటెస్ట్‌గా మంగళవారమే ఐసీసీ, బీసీబీ వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చలు జరిపాయి. వేదికలను ఇండియా నుంచి శ్రీలంక(Srilanka)కు మార్చాలంటూ బీసీబీ చేసిన రిక్వెస్ట్‌పై ఐసీసీ అధికారికంగా స్పందించకపోవటంతో బంగ్లాదేశ్ పాల్గొంటుందా లేదా అనే దానిపై సస్పెన్స్ వీడలేదు.
T20 World Cup | టీ20 ప్రపంచ కప్‌పై కొనసాగుతున్న ఉత్కంఠ
By Aadab Desk
- Advertisement -
Previous article
Next article

