- ఖమ్మం క్రాస్ రోడ్ నుంచి జనగాం క్రాస్ రోడ్ వరకు అనుమతి లేని షెడ్లు..
- 2019 మున్సిపాలిటీ యాక్ట్‌ను తుంగలో తొక్కుతున్న అధికారులు..
- నిర్మాణదారులతో కుమ్మక్కైన టౌన్ ప్లానింగ్ అధికారులు?
- అరకొర అనుమతులతో అదనపు ఫ్లోర్ నిర్మాణాలు
- నోటీసులతో కాలయాపన, కూల్చివేతలకు పాతర
- టౌన్ ప్లానింగ్ అధికారులు పర్యవేక్షణపై ప్రశ్నార్థకం
సూర్యాపేట మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు శ్రుతిమించి పోతున్నాయి. జిల్లా కేంద్రంలో రెండు లక్షలకుపైగా జనాభాతో వేగంగా విస్తరిస్తున్న, పట్టణంలో పట్టణ ప్రణాళిక నిబంధనలు పూర్తిగా గాలికి వదిలేసినట్లు పరిస్థితి నెలకొంది. ఖమ్మం క్రాస్ రోడ్, 60 ఫీట్ రోడ్, కుడకుడ రోడ్, విద్యానగర్, జనగాం క్రాస్ రోడ్‌తో పాటు, పలు ప్రాంతాల్లో అనుమతులు లేకుండానే అక్రమ భారీ షెడ్ల నిర్మాణం, అనుమతులను అతిక్రమిస్తూ అదనపు ఫ్లోర్ భవనాలు, సెల్లార్లతో కూడిన నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగు తున్నాయి. ప్రధాన రహదారుల వెంట సెట్‌బ్యాక్‌లు లేకుండా నిర్మాణాలు జరుగుతుండటంతో పట్టణ వాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పేటలో అమల్లో లేని 2019 యాక్ట్ :
2019 మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారం భవనాల నిర్మాణానికి తప్పనిసరిగా సెట్‌బ్యాక్‌లు, పార్కింగ్ సదుపాయాలు, డ్రైనేజీ, అగ్నిమాపక భద్రత నిబంధనలు పాటించాల్సి ఉంది. అయితే సూర్యాపేటలో ఈ చట్టాన్ని అధికారులు తుంగలో తొక్కి, అక్రమ నిర్మాణదారులకు అండగా నిలుస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. కొంతమంది నిర్మాణదారులు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికా రులతో కుమ్మక్కై అనుమతులు లేకుండానే భారీ షెడ్లు, వాణిజ్య భవనాలు నిర్మిస్తున్నారు.
అను మతులు ఉన్న భవనాల నిర్మాణాలకు అదనపు ఫ్లోర్లు వేసి, సెల్లార్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తూన్నారు.ఈ అక్రమ నిర్మాణాల వల్ల పట్టణంలో రోడ్లు ఇరుకుగా మారి ట్రాఫిక్ సమ స్యలు వెల్లువెత్తుతున్నాయి. వర్షాకాలంలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా విఫలమై లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతు న్నాయి. అత్యవసర పరిస్థితుల్లో అత్యవసర వాహనాలు కాలనీల్లోకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతోందని ప్రజలు వాపోతున్నారు.

కాగితాల మీదికే పరిమితమైన యాక్ట్ :
మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారం అక్రమ నిర్మాణా లపై నోటీసులు జారీ చేయడం, నిర్మాణాలను కూల్చివేయడం, జరిమానాలు విధించడం వంటి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మున్సి పల్ టౌన్ ప్లానింగ్ అధికారులదే. అయితే సూర్యాపేటలో ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోకుండా మౌనం వహిస్తున్నారని, కొన్నిచోట్ల అక్రమాలను చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభు త్వం పట్టణాల క్రమబద్ధ అభివృద్ధి కోసం తీసుకొచ్చిన 2019 మున్సి పాలిటీ యాక్ట్ సూర్యాపేటలో కాగితాలకే పరిమితమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అధికారులు తక్షణమే స్పందించి అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో తీవ్రప్రమాదాలు, న్యాయపరమైన సమ స్యలు తప్పవని పట్టణ ప్రజలు హెచ్చరిస్తున్నారు. జిల్లా కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న సూర్యాపేటను అక్రమ నిర్మాణాల గూటిగా మార్చ కుండా, క్రమబద్ధమైన పట్టణంగా తీర్చి దిద్దేం దుకు ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని యాక్ట్‌ను కఠి నంగా అమలు చేయాలని పట్టణవాసులు డిమాండ్ చేస్తున్నారు. ఈవిషయంపై మున్సిపల్‌టౌన్ ప్లానింగ్ అధికారులను వివరణ కోరెందుకు చరవాణి ద్వారా ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.
