Tuesday, February 10, 2026
Homeరంగారెడ్డిSupport | వృద్దుడి మృతదేహానికి అంత్యక్రియల కొరకు సహకారం

Support | వృద్దుడి మృతదేహానికి అంత్యక్రియల కొరకు సహకారం

  • సురక్ష సేవా సంఘం

అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాట సింగారం గ్రామం…సింగరేణి కాలనీ లో గత 25 సంవత్సరాలుగా కిరాయి కి ఉండి… కూలి పనులు చేసుకుంటూ… మంచానికి పరిమిత మైన తన భర్తను (83) చూసుకుంటూ బతుకు వెళ్లదీస్తున్న పార్వతమ్మ.కు తన అంటూ ఎవరూ లేరు. ఈరోజు ఉదయం 5 గంటలకు భర్త మరణించగా ఏం చేయాలో తెలియక ఆ వృద్ధురాలు.. దిక్కు తోచని స్థితిలో ఎదురు చూస్తుండగా… సురక్ష సభ్యుడు శివ గౌడ్ ఇచ్చిన సమాచారం మేరకు…

సురక్ష సేవా సంఘం గ్రూపు సబ్యులు నుండి విరాళాలు సేకరించి… వృద్ధుని అంత్యక్రియలకు 10,000 రూపాయలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో… సురక్ష సేవా సంఘం అధ్యక్షులు కిక్కర గోపీ శంకర్ యాదవ్, క్రియా శీలక సబ్యులు యాకుబ్, శివ గౌడ్, రంగారెడ్డి, రమేష్, నారాయణ పాల్గొన్నారు.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES

Latest News