Tuesday, October 28, 2025
ePaper
Homeమెదక్‌Ensanpally | గురుకులాల్లో పెరిగిన పర్యవేక్షణ

Ensanpally | గురుకులాల్లో పెరిగిన పర్యవేక్షణ

  • మీరు తిండికి వచ్చారా? డ్యూటీకా..?
  • నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు
  • డైట్ మెనూ అమలుపై ఉలిక్కిపడిన అధికారులు

సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి గురుకులాల నిర్వహణపై ఉక్కుపాదం మోపారు. సిద్దిపేట అర్బన్ మండలం, ఎన్సాన్పల్లి గ్రామంలో గల రెండు కీలక గురుకుల పాఠశాలలు తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకులం మరియు తెలంగాణ సామాజిక బాలికల గురుకులం లో ఆమె నిర్వహించిన ఆకస్మిక తనిఖీతో విద్యా శాఖ అధికారులు, ఉపాధ్యాయులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
భోజనం వద్ద ‘నో మానిటరింగ్’: కలెక్టర్ ఫైర్

విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తుండగా, క్లాస్‌రూమ్‌లలో ఉండాల్సినంత పర్యవేక్షణ లేకపోవడాన్ని కలెక్టర్ హైమావతి గమనించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “విద్యార్థులను మానిటర్ చేయకుండా ఉపాధ్యాయులు ఏం చేస్తున్నారు? మీరు డ్యూటీకి వచ్చారా? తిండికి వచ్చారా? ఇష్టానుసారంగా వదిలేస్తే పిల్లల్లో క్రమశిక్షణ ఎలా వస్తుంది?” అని ప్రిన్సిపల్‌పై ఆమె మండిపడ్డారు. విద్యార్థుల క్రమశిక్షణ, ఆరోగ్యం విషయంలో ఉపాధ్యాయులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంపై ఆమె సీరియస్ అయ్యారు.

ముందు విద్యార్థులు, తర్వాతే టీచర్లు

కలెక్టర్ విధించిన ముఖ్యమైన నిబంధన ఇది. రోజు విద్యార్థులందరూ భోజనం పూర్తి చేసిన తర్వాతే, ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులు భోజనం చేయాలని ఆమె కచ్చితంగా హెచ్చరించారు.


నాణ్యత, కొలత తప్పనిసరి:

ఆమె స్వయంగా ఆహార పదార్థాలు, స్టాక్‌ను తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరుకు అనుగుణంగా రైస్, కూరగాయలు కొలత ప్రకారం ఇవ్వాలని ఫుడ్ చెకింగ్ టీచర్‌ను ఆదేశించారు. ఈ నిబంధనలు పాటించని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు.

మెనూలో రాజీపడొద్దు:

కామన్ డైట్ మెనూను పక్కాగా పాటించాలని, ఆహారం రుచికరంగా, శుభ్రంగా ఉండాలని వంట సిబ్బందిని ఆదేశించారు.
చివరిగా, “విద్యార్థుల భోజనం, వసతి, చదువు విషయంలో నిర్లక్ష్యం వహిస్తే… కఠిన చర్యలు తప్పవు. సస్పెన్షన్‌కు వెనుకాడను” అని కలెక్టర్ హైమావతి ప్రిన్సిపల్‌తో పాటు ఉపాధ్యాయులను హెచ్చరించడంతో గురుకుల పాఠశాల సిబ్బందిలో

RELATED ARTICLES
- Advertisment -

Latest News