Tuesday, March 3, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | ఆత్మహత్యలతో కాదు… ఐక్యతతో విజయం

Aaj Ki Baath | ఆత్మహత్యలతో కాదు… ఐక్యతతో విజయం

ఏ ఆందోళనలో ఆత్మహత్యలు చదివారు ? ఏ పోరాటాల్లో ఆత్మహత్యలు చూశారు ? కొమరం భీమ్ అల్లూరి సాగించిన గిరిజన విముక్తి పోరాటాలలోనా ? భారతరత్న అంబేద్కర్ నడిపిన సాంఘిక పోరాటాలలోనా? భూమికోసం భుక్తి కోసం విముక్తి కోసం సాగిన సాయుధ తెలంగాణ రైతంగ పోరాటాలలోనా? ప్రజలకు ప్రశ్నలు పోరాటాలను నేర్పిన నక్సల్ బరి పోరాటాలలోనా? ఈ దేశ దళితులకు సంఘర్షణ నేర్పిన కారంచేడు, చుండూరు పోరాటాలలోనా? ఎక్కడ చూశారు? ఎక్కడ చదివారు? ఆత్మహత్యలు పోరాట రూపాలు కావు .నిరసనలు బలహీన చర్యలు కావు.. అవి అమ్మానాన్నలకు కంటనీరు. అవి దోపిడీ పాలకులకు నిచ్చెన మెట్లు.. సమత కోసం మమత కోసం ప్రగతి కోసం సోషలిస్టు తెలంగాణ కోసం పోరాడండి విజయ పతాకాన్ని ఎగరవేయండి..

  • చెన్నోజు శ్రీనివాసులు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News