Tuesday, February 10, 2026
Homeక్రైమ్ వార్తలుAttack | 9వ తరగతి విద్యార్థులపై దాడి

Attack | 9వ తరగతి విద్యార్థులపై దాడి

నిందితులు ఇంటర్ ఫస్టియర్ స్టూడెంట్స్
నర్సంపేట గురుకుల పాఠశాలలో ఘటన

వరంగల్ జిల్లా(Warangal District) నర్సంపేట గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల(Narsampet Tribal Welfare Gurukul School)లో విద్యార్థుల మధ్య ఘర్షణ (Student Fight) చోటుచేసుకుంది. ఇంటర్ ఫస్టియర్ స్టూడెంట్స్ 9వ తరగతి విద్యార్థులపై దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో వారిని నిలువరించేందుకు టీచర్లు, వార్డెన్లు, డ్యూటీ స్టాఫ్ ఎవరూ లేరని తెలుస్తోంది. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఘర్షణలో గాయపడి అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థిని తోటి పిల్లలు చేతుల మీద స్థానిక ఆసుపత్రి(Hospital)కి తీసుకెళుతున్న దృశ్యాలు సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అయ్యాయి. గాయపడ్డ విద్యార్థిని దీపక్‌గా గుర్తించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడ(Stable)గా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారని సమాచారం. సీనియర్ విద్యార్థులు జూనియర్లపై ఆధిపత్యం చెలాయించేందుకే అకారణంగా దాడికి దిగారని చెబుతున్నారు.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES

Latest News