దేశ అత్యున్నత న్యాయస్థానం(Supreme Court)లోని ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ బీఆర్ గవాయ్(BR Gavai)పై దాడి జరిగి 12 రోజులు గడుస్తున్నా పోలీసులు కేసు నమోదు చేయకపోవటాన్ని నిరసిస్తూ జాతీయ స్థాయిలో ఆత్మగౌరవ పోరాటం చేపడతామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ చెప్పారు. ఎన్నో కేసులను తమకుతాము(Suo Moto)గా స్వీకరిస్తున్న పోలీసులు ఈ ఘటనను పట్టించుకోకపోవటం లేదని, ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం భీమారంలో అక్టోబర్ 19న జరిగిన ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల రాష్ట్ర అత్యవసర సమావేశంలో మంద కృష్ణ మాదిగ పాల్గొని ప్రసంగించారు.
