Sunday, March 1, 2026
HomeతెలంగాణFire Safety | ఓ.ఆర్.ఆర్. పరిధిలోని భవనాల్లో కఠిన తనిఖీలు..

Fire Safety | ఓ.ఆర్.ఆర్. పరిధిలోని భవనాల్లో కఠిన తనిఖీలు..

  • ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ,
  • సివిల్ డిఫెన్స్ శాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్, ఐపీఎస్..

ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఇటీవల జరిగిన ప్రధాన, ప్రాణాంతక అగ్ని ప్రమాదాల నేపథ్యంలో, తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ, సివిల్ డిఫెన్స్ శాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్, ఐపీఎస్ ఫైర్ శాఖ అధికారులకు అత్యవసర ప్రాతిపదికన ఓఆర్‌ఆర్ పరిధిలోని భవనాల్లో కఠిన తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.

ఈ తనిఖీలు ప్రధానంగా అగ్ని భద్రత, ప్రాణ రక్షణకు ముప్పు కలిగించే ఉల్లంఘనలపై దృష్టి సారిస్తున్నాయి. ముఖ్యంగా భవనాల్లో నివసించే వారి ప్రాణాలకు ప్రమాదం కలిగించే పరిస్థితులు.. సెల్లార్లను పార్కింగ్‌కు కాకుండా నిల్వ గదులుగా వినియోగించడం..
సెల్లార్లలో సేవకులు /వాచ్‌మన్ కుటుంబాలను నివసింపజేయడం.. మెట్ల మార్గాలు, ర్యాంపులను అడ్డగించడం.. ప్రదర్శన / శాంపిల్ అవసరాలకు మించి భారీగా వస్తువులను నిల్వ చేయడం.. ఇతర అగ్ని భద్రతా నిబంధనల ఉల్లంఘనలు.. ఏదైనా లోపాలు గుర్తిస్తే భవనాల యాజమాన్యం/మేనేజ్‌మెంట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

- Advertisement -

భవన యాజమాన్యం తప్పనిసరిగా.. అన్ని ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించడం.. ఫైర్ సేఫ్టీ కోడ్స్‌కు అనుగుణంగా ఉండడం..
ఫైర్ సిస్టమ్స్ సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో చూడడం.. ఫైర్ ఎక్సింగ్ ట్విన్గిషర్లు, స్ప్రింక్లర్లు వంటి పరికరాలు సరిగా పనిచేస్తున్నాయో నిర్ధారించడం.. చేయాల్సివుంటుంది.. ఓఆర్‌ఆర్ పరిధిలో ప్రమాదకరంగా భావించిన సంస్థలపై ఫైర్ అధికారులు 28-01-2026 నుండి తనిఖీలు ప్రారంభించారు. ఇప్పటివరకు మొత్తం 70 వివిధ రకాల సంస్థలను తనిఖీ చేశారు.

వాటి వివరాలు :

ఇన్‌స్టిట్యూషనల్ (సంస్థలు) : 03.. హాస్పిటల్స్: 02.. మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ: 03.. కమర్షియల్: 26.. మర్కంటైల్: 27.. అసెంబ్లీ: 03.. బిజినెస్: 02.. రెసిడెన్షియల్: 01.. ఇండస్ట్రీ: 01.. మల్టీప్లెక్స్: 01.. మాల్: 01.. అలాగే యజమానులు, అద్దెదారులు, ఉద్యోగులకు ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలపై సూచనలు కూడా అందజేశారు. ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ, సివిల్ డిఫెన్స్ శాఖ డైరెక్టర్ జనరల్ ప్రజలందరూ ఫైర్ సేఫ్టీ మార్గదర్శకాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News