Saturday, March 21, 2026
Homeరంగారెడ్డిSewage Problem | మురుగు పరుగు… కనుమరుగయ్యేదెప్పడు?

Sewage Problem | మురుగు పరుగు… కనుమరుగయ్యేదెప్పడు?

మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ 8వ డివిజన్ పరిధిలో కాలనీల మధ్యుగా వెళ్లే సంతోష్ నగర్ దారిలో మురుగునీరు నిల్వ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వానాకాలం ముగిసినా నీరు తొలగించేందుకు చర్యలు కనిపించకపోవడం స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది. రోడ్డు పక్కన చేరిన మురుగు చెరువును తలపిస్తూ పందులకు ఆవాసంగా మారింది.

మురుగులో ఈగలు, దోమలు పెరిగిపోవడంతో వ్యాధులు వస్తాయేమోనన్న భయం ప్రజల్లో నెలకొంది. ఆ దారిలో ప్రయాణించాలంటే ముక్కు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉందని వాపోతున్నారు. పనుల కోసం పట్టణాలకు వెళ్లే వేలాది మంది ప్రతిరోజూ ఇదే రహదారిని ఉపయోగించాల్సి వస్తోందని చెబుతున్నారు.

- Advertisement -

కలుషితంగా మారిన నీటి వల్ల దుర్వాసన భరించలేక వృద్ధులు, పిల్లలు ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారని కాలనీ వాసులు అంటున్నారు. ఇప్పటికే జ్వరం, చర్మ సమస్యలు పెరుగుతున్నాయని, పరిస్థితి మరింత విషమించేలోపు అధికారులు స్పందించాలని కోరుతున్నారు.

వానాకాలం ముగిసిన తర్వాత కూడా మురుగు నీటిని పంపింగ్ చేసి తొలగించకపోవడం విడ్డూరంగా ఉందని ప్రజలు విమర్శిస్తున్నారు. వ్యాధులు వ్యాపించకముందే తక్షణ చర్యలు తీసుకుని శాశ్వత పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News