Saturday, October 4, 2025
ePaper
Homeతెలంగాణస‌మ‌య‌పాల‌న పాటించ‌ని సిబ్బంది..

స‌మ‌య‌పాల‌న పాటించ‌ని సిబ్బంది..

  • ఉదయం 11 గంటలు దాటిన ఖాళీ కుర్చీలే..
  • మంత్రి నియోజకవర్గమైన మారని అధికారుల తీరు..
  • ఇది పుల్కల్‌ మండల ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు

సాక్షాత్తు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రాతివిద్యం వహిస్తున్న అందోల్‌ నియోజక వర్గంలో రెవెన్యూ తో పాటు వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదు. దీనికి నిదర్శనం పుల్కల్‌ తాహసిల్దార్‌ కార్యాలయంలో ఉదయం 11 గంటలు దాటిన ఏ ఒక్క అధికారి లేకపోవడంతో పాటు కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బంది కూడా సమయానికి రాలేక పోయారు. దీంతో వివిధ పనుల కోసం వచ్చిన ప్రజలు కార్యాలయం బయట కూర్చుని అధికారుల కోసం ఎదురుచూస్తూ ఉండిపోయారు. తాహసిల్దార్‌ వంశీకృష్ణ తన వ్యక్తిగత పనుల కోసం సెలవుల్లో ఉండగా జై పేట డిప్యూటీ తహసిల్దార్‌ ప్రణయ్‌ భాస్కర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన సైతం ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు వివిధ పనులు చేసుకొని సమన ప్రజలకు ఇబ్బంది కలగకుండా కార్యాలయానికి వస్తున్నారు. ఎవరు ఒకరు ఇంచార్జి లేకుండా రిజిస్ట్రేషన్లు జరిగేవీ సాధ్యం కాదు. అందుగ్గాను రెగ్యులర్‌గా డిప్యూటీ తాహసిల్దార్‌గా పనిచేస్తున్న వంశీకృష్ణను చౌటకూర్‌ ఇంచార్జ్‌ తాహసిల్దార్‌గా పంపించారు. దీంతో పుల్కల్‌ తాహసిల్దార్‌ సాగర్‌ మధుకర్‌ రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో కిందిస్థాయి సిబ్బంది తమకున్నది ఇంచార్జ్‌ అధికారి అన్న ఉద్దేశంతో ఇష్టానుసారంగా సమయానికి రాలేకపోతున్నారు. గత రెండు రోజులుగా ఉదయం 11 గంటలు దాటిన రెగ్యులర్‌ సిబ్బంది ఎవరు రాలేకపోయారు. తాహసిల్దార్‌ సీటుతో పాటు ఏ సెక్షన్‌కి సంబంధించిన కుర్చీలన్నీ కూడా ఖాళీగా దర్శన మిచ్చాయి. దీంతో వివిధ అవసరాల కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు అధికారులు సకాలంలో రాకపోవడంతో నిరాశతో వెనుతిర‌గి వెళ్ళిపోతున్నారు. సాక్షాత్తు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నియోజకవర్గంలోని అధికారుల పనితీరు ఇలా ఉంటే మీద ప్రాంతాల్లో అధికారుల పడితీరు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా జిల్లా ఉందా అధికారులు ప్రభుత్వ అధికారుల పనితీరుతో పాటు సమయ పాలనపై దృష్టి సారించవలసిన అవసరం ఎంతైనా ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News