Saturday, October 4, 2025
ePaper
Homeతెలంగాణశ్రీశైలం నల్లమల లొద్ది మల్లన్న స్వామి అన్న దాన కార్యక్రమం

శ్రీశైలం నల్లమల లొద్ది మల్లన్న స్వామి అన్న దాన కార్యక్రమం

  • ఏడాదికి తొలి ఏకాదశి ఒకరోజు మాత్రమే స్వామి దర్శనం ఉండేది
  • పులుల సంచారం దృష్ట్యా అడవిలోకి అనుమతించని ఫారెస్ట్ అధికారులు
  • అచ్చంపేట స్థానికులచే మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న అన్నదాన కార్యక్రమం
  • విరాళాలు ఇవ్వదలచుకున్నవారు +91 83093 61966 నెంబర్ ని సంప్రదించవచ్చు

దట్టమైన నల్లమల అడవులు. శ్రీశైలంలో ప్రఖ్యాతిగాంచిన ఉమామహేశ్వర స్వామి, మల్లికార్జున స్వామి, సలేశ్వర లింగమయ్య తో పాటు లొద్ది మల్లన్న స్వామి కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. సంవత్సరంలో కేవలం తొలి ఏకాదశి రోజు మాత్రమే ఈ స్వామివారి దర్శనం ఉండేది. కానీ కరోనా కాలం మొదలుకొని కొన్ని కారణాల చేత ఫారెస్ట్ అధికారులు ఆ ఒక్క రోజు కూడా అనుమతి ఇవ్వడం ఆపేసారు. గత కొద్ది సంవత్సరాల తో పోలిస్తే రాను రాను పులుల సంఖ్య పెరగడం, పైగా తొలి ఏకాదశి సంభవించే కాలం పులులకు సంపర్క కాలం అవడం మొదలైన కారణాల దృష్ట్యా భక్తుల ప్రాణాలకు హాని కాకూడదని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు . అయితే అనుమతి ఉన్న సంవత్సరాల్లో అడవి లోపల స్వామివారి కొలను పక్కన స్థానిక అచ్చంపేట భక్తులు అన్నదానం చేసేవారు. ఇప్పుడు అడవి లోపల కాకుండా జనజీవనం ఉన్న బయటి ప్రాంతంలోనే అన్నదానం ప్రారంభిస్తామని నిర్వాహకులు బలరాం తెలిపారు. అన్నదానానికి విరాళాలు ఇవ్వదలుచుకున్న భక్తులు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా +91 83093 61966 ని సంప్రదించగలరని చెప్పుకొచ్చారు. సాంప్రదాయాన్ని కొనసాగించడానికి అక్కడి స్థానిక భక్తులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అడవిలో అందించిన సేవలు మరువరానివని చెప్పనవసరం లేదు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News