- మార్చి5 వ తేదీ నిండు జాతర!
- గోడ పత్రికలు,కరపత్రాల ఆవిష్కరణ!
ములుగుజిల్లా మంగపేట మండలం లోని రాజుపేట గ్రామంలో ని శ్రీలక్ష్మి నరసాపురం లో వెలసి నాలుగు దశాబ్దాలుగా స్థిరపడి రాష్ట్ర వ్యాప్తంగా విలసిల్లుతున్న “శ్రీ నాగులమ్మ ఆలయంలో రెండేళ్ల కోసారి జరిగే వార్షిక మహాజాతర మార్చి 3 వ తేదీ నుంచి 7 వ తేదీ వరకు అయిదు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా జరుగనున్నట్లు శ్రీ నాగులమ్మ ఆలయ కమిటీ మేనేజింగ్ ట్రస్టీ బాడిష రామకృష్ణ స్వామీజీ వెల్లడించారు. గురువారం ఉదయం ఈమేరకు శ్రీ లక్ష్మీ నరసాపురం ఆలయంలో ఆయన మహాజాతర “కరపత్రాలు- గోడ పత్రికల”ను ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా మహా జాతర క్రతువుల్లో ని కార్యక్రమ వివరాలను ఆయన పత్రికలకు వెల్లడించారు.
కార్యక్రమ వివరాలు ఇలా ఉన్నాయి.
03-03-2026 మంగళవారం ఆలయంలో “మండె మెలుగు” కార్యక్రమం తో జాతర ప్రారంభం కానుంది.రెండవ రోజు
04-03-2026 బుధవారం గండొర్రె గుట్ట నుండి శ్రీ నాగులమ్మ మహతల్లి రాక, గోదావరి పుణ్యస్నానాలు ఆచమనం జరుగుతుంది. మూడవ రోజు 05-03-2026 గురువారం రాత్రి 11.35 ని॥లకు నాగులమ్మ పగిడిద్ద రాజుల కళ్యాణ మహోత్సవం శ్రీ నాగులమ్మ తల్లి ఉపాసకులు బాడిశ రామకృష్ణ స్వామిజీ లోక కణ్యాణం కోసం “అగ్నిగుండాలు” నడుచుట జరుగుతుంది.నాల్గవ రోజు
06-03-2026 శుక్రవారం అశేష భక్తులు మొక్కులు చెల్లించుట తీర్థ ప్రసాదాలు స్వీకారం. అయిదవ రోజు
07-03-2026 శనివారం “అమ్మవారు” తిరిగి వనపవ్రేశం జరుగుతుందని ఆయన తెలిపారు.
కార్యక్రమంలో “ఆలయ మేనేజింగ్ ట్రస్ట్”
బాడిశ రామకృష్ణ స్వామిజీ, ఆలయ పూజారులు బాడిష నాగ రమేష్ స్వామి,బాడిష నవీన్ స్వామి,ఇతర పదిమంది వడ్డెలు,గిరిజనులు, భక్తులు భారీగా పాల్గొన్నారు.
