Monday, February 23, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంDemolition | సికింద్రాబాద్ లో 100 సం॥ల కన్యకాపరమేశ్వరి గుడి కూల్చివేత

Demolition | సికింద్రాబాద్ లో 100 సం॥ల కన్యకాపరమేశ్వరి గుడి కూల్చివేత

  • ఎండోమెంట్ ఆధీనంలో ఉన్న గుడి పేరుతో అక్రమ వసూళ్లు..?
  • గుప్త నిధుల కోసమే పురాతన గుడికూల్చి వేశారా..?
  • ఎండోమెంట్ ఏసీ కృష్ణ భారీ ఎత్తున ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణ
  • గుడి కూల్చివేసిన అక్రమార్కులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయని వైనం..
  • హైకోర్ట్ ఆదేశాలు బేఖాతర్.. స్టేటస్ కో ఆర్డర్ లెక్క చేయని అక్రమార్కులు..
  • ఎండోమెంట్ ఏసీతో పాటు అక్రమార్కులపై క్రిమినల్ కేసులు పెట్టాలి..
  • తెరవెనుక స్థానిక బడా నాయకుల హస్తం ఉందంటూ వస్తున్న ఆరోపణలు
  • మంత్రి కొండ సురేఖ తక్షణ చర్యలు చేపట్టాలని పలువురు డిమాండ్..

కనిపించని దేవుడిని నమ్ముతాం.. దేవుడనే ఒక శక్తి మనిషిని గీత దాటకుండా ఉండేలా చేస్తుంది.. మనిషిలో మానవత్వాన్ని సజీవంగా ఉంచుతుంది.. న్యాయం, ధర్మం, సత్యం అనే విలువలకు కట్టుబడేలా చేస్తుంది.. కానీ అలాంటి పరిస్థితులు ఇప్పుడు కనిపించడం లేదు.. అందుకే పెద్దలు అంటారు కలికాలం అని.. ఇప్పుడు కేవలం డబ్బు సంపాదనే ముఖ్యంగా మనిషి భావిస్తున్నాడు.. ఏకంగా గుళ్ళనే మింగేస్తున్నాడు.. దేవుడి పేరుతో అక్రమాలు చేస్తున్నాడు.. అలాంటి ఘటనే ఇప్పుడు జంటనగరాలతో పాటు.. యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని విస్తుపోయేలా చేస్తోంది..

సికింద్రాబాద్ లో శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన ప్రభుత్వ లేదా కన్యకాపరమేశ్వరి ఆలయాన్ని ఎలాంటి ఎండోమెంట్ అనుమతులు లేకుండా గుప్త నిధుల కోసం అక్రమంగా కూల్చివేశారనే ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.. ఎండోమెంట్ శాఖ ఆధీనంలో ఉన్న ఆలయం ప్రైవేటు గుడి అంటూ అక్రమార్కులు నకిలీ కమిటీ ఏర్పాటు చేసుకొని చట్ట విరుద్ధంగా గుడి అభివృద్ధి పేరుతో వసూళ్లకు తెరలేపిన నకిలీ ముఠా వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

- Advertisement -

భక్తుల విశ్వాసాన్ని ఆసరాగా చేసుకుని కోట్ల రూపాయలు అక్రమంగా వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాత నిర్మాణాన్ని కూల్చివేయడంలో,గుడిలోని పురాతన విగ్రహాలు తొలగించడంలో ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా స్థానిక బడా నాయకుల అండ దండతోనే ఈ వ్యవహారానికి తెర లేపినట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..

ఈ అక్రమ వ్యవహారంలో ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ పూర్తి సహకారం అక్రమార్కులకు అందించి భారీ ఎత్తున ముడుపులు తీసుకున్నారన్న ఇతగాడి పాత్రపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయం కూల్చివేతపై పోలీస్ స్టేషన్లో ఇప్పటివరకు ఫిర్యాదు నమోదు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నదని స్థానికులు అంటున్నారు..భారీ ఎత్తున ముడుపులు తీసుకుని అక్రమార్కులకు పరోక్ష సహకారం అందించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కూడా ఇటీవలే ఎండోమెంట్ అధికారి ఏసీ కృష్ణని ఇదే విషయం పై వివరణ కోరగా “ఆ గుడికి తనకు సంబంధం లేదని, అది ప్రైవేటు గుడి” పేర్కొనడంలో దాగి ఉన్న మరమ్మెంటో ఆయనే బహిర్గతం చేయాలి.. అయితే రాష్ట్ర హైకోర్టుకు మాత్రం సదరు ఆలయం ఎండోమెంట్ ఆధీనంలో ఉందని, అనుమతులు లేకుండా కూల్చివేయడంతో పాటు కమిటీ ఏర్పాటు చేసి డబ్బులు వసూలు చేస్తున్నారని స్పష్టంగా తెలిపినట్లు తెలుస్తోంది.. ఎండోమెంట్ అధికారి కృష్ణ హైకోర్టు ఉత్తర్వులు బేఖాతరు చేస్తూ చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు ఆజ్యం పోస్తూ విభిన్న వైఖరితో ఉన్నాడనే మాటలు బహిరంగంగా వినిపిస్తున్నాయి..

అయితే సికింద్రాబాద్ నడిబొడ్డులో.. దాదాపు 100 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రగలిగిన కన్యకాపరమేశ్వరి ఆలయాన్ని కూల్చివేయడం, బోగస్ గా ప్రభుత్వానికి సంబంధం లేకుండా సెల్ఫ్ కమిటీ వారికి వారే ఏర్పాటు చేసుకుని అక్రమంగా భక్తుల యొక్క భక్తిని ఆసరాగా చేసుకొని పైసలు వసూళ్లు చేయడం అవినీతికి పరాకాష్టగా నిలుస్తోంది.. వేలాదిమంది తిరిగే చోట..

ఇంత బరితెగించి ఎలాంటి అనుమతులు లేకుండా గుడిని కూల్చివేస్తుంటే ఎవరికీ కనిపించడం లేదా..? ఎన్నో హిందూ సంఘాలు, ధార్మిక సంఘాలు ప్రతినిత్యం దైవారాధన, ధర్మ పరిరక్షణ గురించి ప్రచారం చేస్తూ ఉంటారు.. మీటింగులు పెట్టి ఉపన్యాసాలు ఇస్తుంటారు.. మరి తమ కళ్ళెదుట జరిగిన ఈ అక్రమ కూల్చివేతలు వారికి కనిపించడం లేదా..? దీనిపై మాట్లాడటానికి ఎందుకు వెనుకంజవేస్తున్నారు..?

సంబంధిత దేవాదాయ శాఖ అధికారులు ఏమి చేస్తున్నారు..?ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆస్తిని ధ్వంసం చేస్తే పోలీస్ కేసు పెట్టాలన్న అవగాహన లేకుండా ప్రభుత్వ అధ్యోగులుగా ఎలా చెలామణి అవుతున్నారన్న అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.. ఇంత జరుగుతున్నా స్థానిక ప్రజలు, భక్తులు, నాయకులు, ఎమ్మెల్యే, ఎంపీలు ఏమి చేస్తున్నారు..? హై కోర్టు తీర్పు అంటే దానికి గౌరవించక పోవడం ఏంటని..ఈ అవినీతి వ్యవహారంపై కనీసం ఒక్క గొంతు కూడా పెగలకపోవడానికి గల బలమైన కారణం ఏమిటి..? దీన్ని వెనుకనుండి నడిపిస్తున్న అరాచక శక్తి ఏమిటి..? ఇప్పుడీ ప్రశ్నలు అందరి మెదళ్లను తొలుస్తున్నాయి..

ఈ నేపథ్యంలో ఎండోమెంట్ శాఖ మంత్రి కొండ సురేఖ తక్షణ జోక్యం చేసుకుని అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ ను వీధుల నుండి తొలగించి ఇతగాడి వ్యవహార శైలి పై చర్యలు తీసుకోవాలని, అక్రమంగా ఆలయం కూల్చివేసిన వ్యక్తులపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు.. అలాగే దేవాదాయశాఖ కమిషనర్ ప్రత్యేక అధికారిని నియమించి సమగ్ర విచారణ జరపాలని, హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని స్థానికులు కోరుతున్నారు.. విజిలెన్స్ విచారణ ద్వారా వాస్తవాలను వెలికితీయకపోతే రాష్ట్రవ్యాప్తంగా హిందూ సంఘాలు ఆందోళనకు దిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు..

మహిళా మంత్రి కొండ సురేఖ శాఖ మచ్చ తెచ్చే పని చేయుటకు కుయుక్తులు పన్నుతున్న స్థానిక నాయకుల వ్యవహారం చేస్తున్న అరాచకాలు అక్రమాలకు సంబంధించి పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా మరింత సమాచారం వెలుగులోకి తేనుంది

“ఆదాబ్ హైదరాబాద్” ‘మా అక్షరం అవినీతిపై అస్త్రం’..

- Advertisement -
RELATED ARTICLES

Latest News