Monday, January 19, 2026
EPAPER
Homeస్పోర్ట్స్CM Cup | 33 జిల్లాల్లో ముమ్మరంగా క్రీడాజ్యోతి ర్యాలీలు

CM Cup | 33 జిల్లాల్లో ముమ్మరంగా క్రీడాజ్యోతి ర్యాలీలు

పలు మండలాల్లో కొనసాగుతున్న టార్చ్ రిలే
ఉత్సాహంగా పాల్గొంటున్న యువ క్రీడాకారులు

తెలంగాణ క్రీడా శాఖ ఆదేశాల మేరకు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ(Telangana Sports Authority) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండో విడత సీఎం కప్–2025కు విస్తృత ప్రచారం కల్పించడంతోపాటు గ్రామీణ క్రీడాకారుల్లో అవగాహన (Awareness) పెంపొందించేందుకు చేపట్టిన క్రీడాజ్యోతి ర్యాలీలు(Torch Relay) రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల వ్యాప్తంగా పలు మండలాల్లో ఈ క్రీడాజ్యోతి ర్యాలీలు దిగ్విజయంగా కొనసాగుతూ క్రీడాకారుల్లో(Players) ఉత్సాహం(Excitement) నింపుతున్నాయి. పలు జిల్లా కేంద్రాల్లో జరుగుతున్న కార్యక్రమాల్లో ఆయా జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, అదనపు కలెక్టర్లతోపాటు వివిధ శాఖల అధికారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సిద్దిపేట జిల్లాలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, తూర్పు నిర్మల జయప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, స్థానిక శాసన సభ్యుడు మేఘారెడ్డి పాల్గొన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ బి.సంతోష్, స్థానిక శాసన సభ్యుడు కె.రాజేష్ రెడ్డి పాల్గొన్నారు. మరో కార్యక్రమంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు, అదనపు కలెక్టర్ తదితర అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలాత్రిపాఠి, శాసన సభ్యుడు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ క్రీడాజ్యోతి ర్యాలీలు 17వ తేదీ వరకు కొనసాగనున్నాయని అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News