తమిళనాడు(Tamil Nadu)లోనూ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision-SIR) చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission Of India) మద్రాస్ హైకోర్ట్(Madras High Court)కు తెలిపింది. వారం రోజుల్లో ఈ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. అస్సాం, కేరళ, పుదుచ్చెరి, తమిళనాడు అసెంబ్లీలకు వచ్చే ఏడాదిలో ఎలక్షన్స్ జరగనున్నాయి. ఎస్ఐఆర్ అనేది ప్రస్తుతం బీహార్(Bihar)కే పరిమితమైంది. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపడతామని ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) గతంలోనే ప్రకటించారు. బీహార్‌లో నిర్వహించినప్పుడు విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
