Friday, October 3, 2025
ePaper
Homeఅంతర్జాతీయంఇండియన్ల కోసం గగనతలం ఓపెన్

ఇండియన్ల కోసం గగనతలం ఓపెన్

ఇరాన్‌ నుంచి నేడు ఢిల్లీకి తొలి ఫ్లయిట్

ఇరాన్, ఇజ్రాయెల్‌ యుద్ధంతో 8 రోజులుగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. రెండు దేశాలు ఒకదానిపై ఒకటి క్షిపణి దాడులకు పాల్పడుతున్నాయి. ఇవాళ (జూన్ 20 శుక్రవారం) ఉదయం ఇరాన్‌లోని అణుస్థావరాలను టార్గెట్‌గా చేసుకొని ఇజ్రాయెల్‌ ఎటాక్ చేసింది. ప్రతిగా ఇరాన్ మొదటిసారిగా ఇజ్రాయెల్‌పై క్లస్టర్‌ బాంబులను ప్రయోగించింది. ఈ పరిస్థితుల్లో ఇరాన్‌లోని మనవాళ్లను స్వదేశానికి తీసుకురావటానికి ఇండియా చర్యలు చేపట్టింది. దీంతో ఇరాన్‌ ముఖ్య నిర్ణయం తీసుకుంది. ఇండియన్ల తరలింపు కోసం తన గగనతలాన్ని ఓపెన్ చేసింది. అక్కడ చిక్కుకున్న సుమారు వెయ్యి మంది మన విద్యార్థులు స్వదేశానికి రావటానికి మార్గం సుగమమైంది. ఫస్ట్ ఫ్లయిట్ ఈ రోజు రాత్రి 11 గంటలకు ఢిల్లీకి చేరనుంది. రేపు ఉదయం ఒక విమానం, సాయంత్రం మరో విమానం రానున్నాయి. ఇజ్రాయెల్‌తో యుద్ధం నేపథ్యంలో ఇరాన్‌ తన గగనతలాన్ని పూర్తిగా క్లోజ్ చేసింది. తాజాగా మన విమానాల కోసం మాత్రమే తెరిచింది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News