Sunday, October 26, 2025
ePaper
HomeతెలంగాణHyderabad | సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్‌

Hyderabad | సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్‌

అమెరికా(America)కు చెందిన ప్రఖ్యాత విమానయాన సంస్థ సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ (Southwest Airlines Co) తన గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటుచేయనుంది. సచివాలయంలో సీఎం రేవంత్(CM Revanth) రెడ్డితో జరిగిన సమావేశంలో సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి బృందం ఈ నిర్ణయం ప్రకటించింది. ప్రపంచ పెట్టుబడులకు, సాంకేతిక ఆవిష్కరణలకూ కేంద్రంగా నిలుస్తున్న హైదరాబాద్ నగరంలో గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ (Global Innovation Centre) స్థాపన నిర్ణయాన్ని సీఎం స్వాగతించారు. ఈ సందర్భంగా సీఎం రాష్ట్ర ప్రభుత్వ సానుకూల విధానాలను, అభివృద్ధి లక్ష్యాలను వివరించారు.

‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌లో భాగంగా 2034 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. ఈ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ శ్రీమతి లారెన్ వుడ్స్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ టామ్ మెరిట్, హెడ్ లీగల్ కౌన్సిల్ జాసన్ షైయింగ్, HEX అడ్వైజరీ గ్రూప్‌కు చెందిన శ్రీ సార్థక్ బ్రహ్మ, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News