Tuesday, March 3, 2026
Homeఅంతర్జాతీయంBBC | సారీ.. ట్రంప్ సార్..

BBC | సారీ.. ట్రంప్ సార్..

బీబీసీని వదిలే ప్రసక్తే లేదన్న ట్రంప్

అమెరికా అధ్యక్షుడు (America President) డొనాల్డ్ ట్రంప్‌(Donald Trump)కు ప్రముఖ వార్తా సంస్థ బీబీసీ క్షమాపణలు (Sorry) చెప్పింది. ఈ మేరకు వైట్‌హౌజ్‌(White House)కి బీబీసీ చైర్మన్ సమీర్ షా పర్సనల్‌గా లెటర్ (Letter) రాశారు. అమెరికాలోని క్యాపిటల్ హిల్‌(Capital Hill)పై దాడి సందర్భంగా ట్రంప్ చేసిన ప్రసంగానికి తప్పుడు భాష్యం చెప్పినందుకు మన్నించాలని కోరారు. ఈ పొరపాటుకు తనతోపాటు బీబీసీ కూడా విచారం చెందుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

- Advertisement -

అయితే.. ట్రంప్ డిమాండ్ చేసిన బిలియన్ డాలర్ల పరిహారాన్ని (Compensation) చెల్లించేందుకు తాము ఒప్పుకోలేదని బీబీసీ ఓ కథనంలో పేర్కొంది. ఈ తప్పు చేసినందుకు ఇప్పటికే బాధ్యత వహిస్తూ బీబీసీ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ, న్యూస్ చీఫ్ టర్నెస్ డెబోరా తమ ఉద్యోగాల నుంచి తప్పుకున్నట్లు వెల్లడించింది. ఇదిలాఉండగా.. తనకు పరువు నష్టం కలిగించిన బీబీసీని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, 1 నుంచి 5 బిలియన్ డాలర్ల వరకు పరిహారం కోరుతూ కోర్టులో దావా వేస్తానని తాజాగా హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News