Thursday, September 11, 2025
ePaper
spot_img
Homeఆరోగ్యంసోనియాగాంధీకి మరోసారి అస్వస్థత

సోనియాగాంధీకి మరోసారి అస్వస్థత

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో హిమాచల్‌ప్రదేశ్‌లో సిమ్లాలో ఉన్న ఇందిరాగాంధీ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమెకు వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సోనియాగాంధీ హాస్పిటల్‌లో చేరిన విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రధాన సలహాదారు (మీడియా) నరేష్ చౌహాన్ పేర్కొన్నారు.

స్వల్ప ఆరోగ్య సమస్యలతో రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసం సోనియాగాంధీ ఆసుపత్రిలో చేరినట్లు స్పష్టం చేశారు. ఆమె ఆరోగ్యం ఇప్పుడు నిలకడగానే ఉందని తెలిపారు. సోనియాగాంధీకి ఎంఆర్ఐ పరీక్షలు జరిపినట్లు సమాచారం. 78 ఏళ్ల సోనియాగాంధీ 2025 మే 27న దివంగత ప్రధాని జవహర్‌లానెహ్రూ 61వ వర్దంతి సందర్భంగా కనిపించారు. గతంలో పలుమార్లు అస్వస్థతకు గురై మన దేశంతోపాటు విదేశాల్లోనూ వైద్యం పొందిన సంగతి తెలిసిందే.

RELATED ARTICLES
- Advertisment -

Latest News