ప్రతి పోలీసు(Police)లో రెండు కోణాలు.. జడిపించే లాఠీ రక్షించే డ్యూటీ..!.
అంత లూజు నిక్కరు నుంచి ఇప్పటి అందమైన యూనిఫారం(Uniform) వరకు ఎన్నో మార్పులు..కాని అదే ఖాకీ..అదే చలాకీ..!
దాసరి నారాయణరావు (Dasari Narayana Rao) వేస్తే పోలీసు వెంకటసామి..!
సూర్య అయితే సింగం..!
అదే ఎన్టీఆర్ (NTR) అయితే కొండవీటి సింహం..!
సాయికుమార్ కడితే వాడేరా పోలీస్..!
మొత్తానికి ఎవరు వేషం కట్టినా పోలీస్ అంటేనే..కనిపించని నాలుగో సింహం..!
యూనిఫారం తొడిగితే…ప్రతి క్షణం చెలగాటం..జీవితమంతా పోరాటం..!
ఇటూ అటూ పొగలు కక్కే తుపాకులు..మధ్య మండే ఎండుటాకులు..!
మందుపాతర్ల నడుమ మృత్యుకేళి..డ్యూటీ అంటేనే మరణంతో కలిసి వెళ్లే వ్యాహ్యాళి..!
తప్పు జరిగితే మ్రోగే విజిల్..నేరస్తులకు పజిల్ శారీరక దృఢత్వం..కనిపించని కర్కశత్వం..!

నేరం చేస్తే ఎంతటి వాడైనా ఎక్కించేయి వాన్..డ్యూటీ ఈజ్ డివైన్..!
మొన్న కరోనా విలయవేళ.. సర్వాంతర్యామి పోలీసు..ఆడేసాడు జనాలతో ఢంకా పలాసు..మెత్తగా చెబితే క్లాసు..లాఠీకి పని చెబితే మాసు..మొత్తానికి నియంత్రణలో అతడి పాత్ర హై కలాసు..!
పోలీసన్నకు పెరిగింది ప్రజలపై మమకారం…నువ్వే లేకపోతే సమాజం అంధకారం..!
నువ్వు కాదా మరో జవాను..ఈ జాతికి నువ్వే పారాహుషార్ మేమంతా చెప్పమా నీకు పదేపదే జోహార్..!_🫡
సిరులు పొంగిన జీవగడ్డై.. పాలు పారిన భాగ్యసీమై.. రాలినది ఈ భారతఖండం…!
ఓ వైపు దుండగుల దాడులు, తీవ్రవాదుల పన్నాగాలు, అంతర్గత కలహాలు, బందోబస్తులు, విఐపి భద్రత, ట్రాఫిక్ విధులు, మానసిక ఒత్తిడి, మరోవైపు కుటుంబాల బాద్యతలు..!
ఈ క్లిష్ట పరిస్తితులలో కూడా ప్రజల కోసం మీరు ప్రదర్శించిన దృక్పథం, వ్యక్తిత్వం అసమానం, అబ్బురం..!
అమరవీరులారా..ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం..!
మీ రక్తం చాలా శక్తివంతమైనది. విధినిర్వహణలో..మీ త్యాగంతో సూర్యునిగా వెలుగొందుతున్నది భారతావని. మీ త్యాగఫలాన్ని అనుభవిస్తూ మీ ఆత్మశాంతి కోసం ఇదే మా అశ్రునివాళి. జై హింద్..!
(పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం-అక్టోబర్ 21 సందర్భంగా)
Suresh Betha – DRONA
