Friday, March 20, 2026
Homeసాహిత్యంAwakening | వ్యక్తి శక్తిగా ఎదిగి

Awakening | వ్యక్తి శక్తిగా ఎదిగి

సమాజ మార్పుకు
మార్గదర్శి కావాలి

వ్యక్తి శక్తిగా ఎదిగి
సమాజమార్పుకు
మార్గదర్శి కావాలి

- Advertisement -

గతాన్నివదలద్దు
గమ్యాన్ని మరువద్దు

గతాన్ని మరిచిన వారికి
భవిష్యత్తు ప్రశ్నార్థకం

మూలాలు మరిచిన వారికి
ముందుకు వెళ్లడానికి
దారులు మూసుకుపోతాయి

ఏఅంతస్తుపై నిలబడ్డామనేది
ముఖ్యం కాదు ఎందుకు
నిలబడ్డా మన్నదే ప్రధానం
ఎన్ని మెట్లు ఎక్కామో
గుర్తుంచుకోవాలి

ఏ సమాజానకి సేవా చేశాం
అన్నది ముఖ్యం కాదు ?
సమాజానికి ఏమి సేవ
చేసామో ముఖ్యం

నీ చేతలు సమాజ
చైతన్యానికి
చేయూత నివ్వాలి
ఎంత మంది జీవితాలను
ప్రభావపరిచాయో
ముఖ్యం
జాతి ఐక్యత సమైక్యత
సంఘీభావానికి
సానుకూలతను
సమకూర్చాయా
అన్నది ప్రధానం

వ్యక్తి స్వార్థం కన్న
వ్యవస్థ స్వార్థం మిన్న

వ్యక్తి భక్తి కన్న
దేశ భక్తి గొప్ప.

గత నాయకుల
త్యాగాలను
మరువద్దు.

వారు వేసిన
పునాదుల మీద
సమాజాన్ని నిర్మించి
వారి కృషిని
సంఘ సేవతో
స్మరిస్తూ వారి
ఆశయాల సాధనకు
వారు చూపిన బాటన
నడవాలి వారి
మాటనునిలుపాలి

వారు నెలకొల్పిన
విలువలు గౌరవం,
ఆత్మాభిమానంతో’
జాతి సమైక్యత శక్తిని
బలోపేతం చేసే
పలు సామాజిక
భాగ స్వామ్య
కార్యక్రమాలు,
గత నాయకుల
సేవలను స్మరిస్తూ
వారి మెమోరియల్
ఉపన్యాసాలు
వారి పేరున అవార్డ్స్
బహుకరించే సదస్సులు
చర్చలు నిర్వహించడం
ద్వారా
నేటి యువతరంలో
సంఘ సేవాతత్పరతను
కలిగించడం ద్వారా
సంఘ సేవ
అభివృద్ధికార్యక్రమాల
నిర్మాణానికి పూనుకోవడం
రాజకీయ నాయకత్వం
కార్యాచరణ కావాలి.

ద్వితీయ శ్రేణి
నాయకులను
తయారు చేయాలి
త్యాగ శీలుర మాటే
మన బాట కావాలి.
వారు చూపిన
మార్గంవదలద్దు

సమాజ సేవ
భూషణం కావాలి
కానీ ధూషణం కావద్దు

సంస్థలు సంఘాలు
వ్యక్తుల ఆత్మగౌరవాన్ని
పెంచాలి.

గతం లేకుండా
వర్తమానంలేదు,
వర్తమానం లేకుండా
భవిష్యత్తు లేదు.

చరిత్ర చదువాలి.
గతచరిత్ర లేకుండా
భవిష్యత్తు చరిత్రను
నిర్మించలేము.

గతనాయకులు
చేసిన సేవలు
విస్మరించడం
ఇప్పుడు మేమే
చేసామనడం
ఆహాంకారానికి
నిదర్శనం.

ఆహాంకారం వ్యక్తుల
పతనానికి దారితీస్తుంది.
పిల్లవచ్చి కోడి గుడ్డును
వెక్కిరించినట్లుంటుంది.

చాలామంది ఒకటో
రెండో పనులు చేసి
సర్వం చేసినట్లు
చంకలు గుద్దుకుంటారు.

గతం మరిచిపోయి
మేము అంతాచేసినట్లు
డంకా భజాయిస్తారు
అదివారిమూర్ఖత్వమే
అవుతుంది

ఆత్మీయత, అభిమానం,
ఆదరణ,ఐక్యత,
చైతన్యంతో హక్కుల
రక్షణ కోసం వ్యక్తులు
స్వచ్ఛంద సైనికులుగా
ఎదగాలి.

నవసమాజాన్ని
నిర్మాణానికి
ఉద్యమించాలి

వ్యక్తిలో సహనం ఓర్పు
సంకల్పం త్యాగ శీలత
ఉండాలి.

ఒక పనితో వంద పనులు
చేసినట్లు వక్రీకరించడం
సరికాదు.

అబద్ధాలు చెప్పడం
సరికాదు.
నమ్మకం ముఖ్యమైనది.
చైతన్యం శాశ్వతమైనది.
సంఘం మంటే బలం
భరోసా భద్రత అనే
మనోధైర్యం ఇవ్వాలి

ఆత్మ స్థైర్యం అనే భవన
నిర్మాణంలో అందరు
భాగస్వాములు కావాలి

కుట్రలు కుయుక్తులు
మానాలి
భారత జాతి
సౌభాగ్యానికి
స్వయం స్వమృద్దికి
సుస్తిరాబివృద్దికి
సామాజిక ఉన్నతితో
సమాజంలో వ్యక్తి
ఆత్మ గౌరవాన్ని
ఇనుమడింప చేసే
గమ్యాన్ని మరువద్దు.

సంస్థలు రాజకీయాలకు
అతీతంగా బలమైన
సాంఘిక ఆర్థిక శక్తిగా
ఎదగడానికి దోహదపడే

దీర్ఘ కాలిక సామాజిక
ఆర్థిక రాజకీయ వ్యూహాలతో
జాతీయ నాయకత్వం
ముందుకుసాగాలి.

బడుగు బహుజన వర్గాలు
రాజ్యాధికారదిశగా కదలాలి.
పాలకులుగా నిలువాలి.

వ్యక్తి సమాజాన్ని
శాసించే శక్తిగాఎదగాలి
గతాన్ని వదలద్దు
గమ్యాన్ని మరువద్దు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News