Monday, October 27, 2025
ePaper
Homeస్పోర్ట్స్Skating | మానసిక వికాసానికి స్కేటింగ్ దోహదం

Skating | మానసిక వికాసానికి స్కేటింగ్ దోహదం

స్పీడ్ స్కేటింగ్ కోచ్ కన్నా గౌడ్ వెల్లడి

బౌరంపేట్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బౌరంపేట్‌లో GRSA ఆధ్వర్యంలో ఇంటర్ స్కూల్ రోలింగ్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్ (Inter School Rolling Skating Championship) పోటీలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలను కోచ్ (Coach) శ్రీరామ్.. రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీడ్ స్కేటింగ్ కోచ్ కన్నా గౌడ్ మాట్లాడుతూ మానసిక వికాసానికి (mental development) స్కేటింగ్ ఎంతో దోహదపడుతుందని చెప్పారు. అందువల్ల వివిధ స్కూల్స్‌లో స్కేటింగ్ నేర్పిస్తున్నారని తెలిపారు. వివిధ రకాల స్కేటింగ్‌ల్లో.. ప్రో ఇన్ లైన్ స్కేటింగ్, క్వాడ్ స్కేటింగ్, రెగ్యులర్ ఇన్ లైన్స్ కేటింగ్‌లో పోటీలు నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌లో 400 మందికి పైగా విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలో సెంట్ మేరీ బెటాలియన్ స్కూల్ (నాగారం) రెండో తరగతి విద్యార్థిని పోస్తూ బ్లేస్సి అండర్ 8 బంగారు పతాకాన్ని సాధించింది. కార్యక్రమంలో వి.గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News