Wednesday, February 11, 2026
Homeకరీంనగర్Arrest | ఆరుగురు దొంగల అరెస్ట్

Arrest | ఆరుగురు దొంగల అరెస్ట్

రూ.20 లక్షల సొత్తు స్వాధీనం
15 కేసుల మిస్టరీ ఛేదన
ఏసీపీ జి.విజయ కుమార్ ఆధ్వర్యంలో పోలీసు బృందం
అభినందించిన పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం

కరీంనగర్, నవంబర్ 15 (ఆదాబ్ హైదరాబాద్): కరీంనగర్ జిల్లా గ్రామీణ ప్రాంత పరిధిలో కొన్ని నెలలుగా రైతులు, ప్రజల ఆస్తులకు నష్టం కలిగించిన దొంగతనాల కేసులను (Theft Cases) జిల్లా పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ప్రధానంగా 12 కాపర్, కరెంట్ మోటార్ వైర్ దొంగతనాలు, 3 పశువులు, పందులు, గొర్రెలు, మేకల దొంగతనాల కేసుల (మొత్తం 15 కేసులు) మిస్టరీ(Mystery)ని ఛేదించి ఆరుగురు నిందితులను (Accused) అరెస్టు చేశారు.

- Advertisement -

ఈ వివరాలను కరీంనగర్ పోలీస్ కమిషనర్(Police Commissioner) శనివారం వెల్లడించారు. చొప్పదండిలోని గుమ్లాపూర్ చౌరస్తా వద్ద పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో (Checkings) అనుమానాస్పదంగా వెళ్తున్న ఒక బొలెరో క్యాంపర్, ఒక అశోకా లేల్యాండ్ వాహనాలను ఆపి తనిఖీ చేయగా ఈ దొంగతనాల్లో పాల్గొన్న నిందితులు పట్టుబడ్డారు.

దొంగల ముఠాతోపాటు రిసీవర్ అరెస్టు

పట్టుబడ్డ నిందితులు గతంలో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన 15 కేసుల్లో(చొప్పదండి, గంగాధర, చిగురుమామిడి, మానకొండూరు, కరీంనగర్ రూరల్, రామడుగు, ఎల్ ఎం డి, దుగ్గొంది పోలీస్ స్టేషన్ల పరిధిల్లోని దొంగతనాల్లో పాల్గొన్నట్లు) నిందితులని దర్యాప్తులో తేలిందన్నారు. దొంగిలించిన సొత్తును వీరి నుంచి కొనుగోలు చేసిన స్క్రాప్ వ్యాపారి (రిసీవర్) కూడా పట్టుబడ్డాడు.

నిందితుల వివరాలు..

  1. మనుపాటి శేఖర్(36 yrs), డ్రైవర్, కట్టరాంపూర్–కరీంనగర్
  2. మనుపాటి సంజీవ్(26 yrs), కూలీ, విజయనగరం కాలనీ–చొప్పదండి
  3. ఉండాటి మహేశ్(27 yrs), పందుల వ్యాపారి, బేగంపేట–రామగిరి
  4. బోదాసు కుమార్(33 yrs), ఆటో డ్రైవర్, వెల్జీపూర్–ఇల్లంతకుంట(మం)
  5. సాగర్ల రంజిత్(36 yrs), JCB డ్రైవర్, పెంచికల్‌పేట్–కమాన్‌పూర్
  6. బొడిగే సంపత్(రిసీవర్) (42 yrs), స్క్రాప్ వ్యాపారి, సంతోష్‌నగర్–చొప్పదండి

ప్రధాన నిందితుడు మనుపాటి శేఖర్ దొంగిలించిన సొమ్మును వాహనాల కిస్తీలు కట్టడానికి, జల్సాలకు ఖర్చు చేసినట్లు అంగీకరించాడు. స్వాధీనం చేసుకున్న ఆస్తుల వివరాలు(మొత్తం విలువ రూ. 20 లక్షలు). అవి.. బొలెరో వాహనం, అశోకా లేల్యాండ్ వాహనం, మోటర్ సైకిల్, 3 క్వింటాళ్ల కాపర్ వైర్ (స్క్రాప్ వ్యాపారి బొడిగే సంపత్ నుంచి కొంత స్వాధీనం చేసుకున్నారు).

- Advertisement -
RELATED ARTICLES

Latest News