కేసీఆర్‌కు నోటీసులంటే యావత్ తెలంగాణకు నోటీసులే
రేవంత్ రెడ్డి అభద్రతా భావానికి నిదర్శనమే సిట్ నోటీసులు
హామీల అమలు వదిలేసి రేవంత్ పూటకో డైవర్షన్ డ్రామాలు
పిచ్చోడి పాలనలో కీలుబొమ్మలుగా ప్రభుత్వ సంస్థలు
కేసీఆర్‌ను సిట్‌లు, కమిషన్లు ఏం చేయలేవు
తెలంగాణ సమాజమంతా కేసీఆర్ వెంటే
మునిసిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు శిక్ష తప్పదు
మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
మాజీ సీఎం కేసీఆర్‌కు ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో నోటీసులు (SIT Notice to KCR) ఇవ్వడాన్ని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే (Balkonda Mla) వేముల ప్రశాంత్ రెడ్డి(Vemula Prashanth Reddy) తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ఉద్యమ శిఖరం, రాష్ట్ర స్వాప్నికుడు, సాధకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ఫోన్ ట్యాపింగ్ కేసు పేరిట సిట్ నోటీసులు ఇవ్వడం అత్యంత దుర్మార్గమైన, కక్షసాధింపు రాజకీయానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు ప్రతిరూపం కేసీఆర్. ఆయనకు నోటీసులు ఇవ్వడమంటే యావత్ తెలంగాణ సమాజానికే నోటీసులు ఇచ్చినట్లు భావించాలని అన్నారు.
ఉద్యమ నాయకుడు, రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి పథంలో నడిపిన నేతపై ఇలాంటి చర్యలు తీసుకోవడం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడమేనని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిలో తీవ్ర అభద్రతాభావం పెరిగిపోయిందని, తన ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో కప్పిపుచ్చుకునేందుకే సిట్‌లు, కమిషన్ల పేరుతో డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపుతున్నారని ధ్వజమెత్తారు. మునిపల్ ఎన్నికల వేళ ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలన్న దురుద్దేశంతోనే ఈ నోటీసుల డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు చేతకాక పూటకో డైవర్షన్ డ్రామాలుచేస్తూ రేవంత్ రెడ్డి కాలం గడుపుతున్నాడని విమర్శించారు.
సీఎం రేవంత్ రెడ్డి అవివేకపూరిత, పిల్ల చేష్టలతో కూడిన పాలనలో ప్రభుత్వ సంస్థలు స్వతంత్రత కోల్పోయి కేవలం కీలుబొమ్మలుగా మారాయని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ చరిత్రను లిఖించిన నాయకుడు, రాష్ట్రాన్ని సాధించి దేశానికి ఆదర్శంగా నిలిపిన కేసీఆర్ వ్యక్తిత్వానికి, ప్రతిష్టకు రేవంత్ రెడ్డి పిల్ల చేష్టలతో మలినం అంటించడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. ఇలాంటి కక్షసాధింపు చర్యలతో చివరికి ఆయనే ప్రజల్లో నవ్వులపాలవుతారని హెచ్చరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను వ్యక్తిగత రాజకీయ అవసరాల కోసం దుర్వినియోగం చేయడం దురదృష్టకరమని ఆవేదన వెలిబుచ్చారు.
సిట్‌లు, కమిషన్ల పేరుతో రాజకీయ ప్రత్యర్థులను వేధించడం కాంగ్రెస్ ప్రభుత్వ అసలైన స్వభావాన్ని బయటపెడుతోందని బాల్కొండ ఎమ్మెల్యే దుయ్యబట్టారు. తెలంగాణను ఆత్మగా భావించే ఉద్యమకొండ కేసీఆర్‌ను ఈ సిట్ నోటీసులు ఏం చేయలేవని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు నోటీసులిచ్చి రేవంత్ రెడ్డి తన రాజకీయ సమాధిని తానే తవ్వుకున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సిట్‌లు, కమిషన్లు, అక్రమ కేసులతో కేసీఆర్‌ను ఏం చేయలేరని, తెలంగాణ సమాజమంతా ఆయన వెంటే నిలబడుతుందని చెప్పారు.
ఎన్ని కుట్రలు, ఎన్ని డైవర్షన్ రాజకీయాలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో ఎండగడుతూనే ఉంటుందని హెచ్చరించారు. మునిసిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన మూల్యం తప్పదని ప్రశాంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.
