సిర్పూర్(టి) మండల కేంద్రంలో 19 మంది గిరిజన లబ్ధిదారుల(Tribal Beneficiaries)కు ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Indlu) మంజూరు పత్రాలను సిర్పూర్ శాసన సభ్యులు(Sirpur Mla) డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అందజేశారు. మండల కేంద్రంలోని రైతు వేదిక(Raituvedika)లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లబ్ధిదారులందరూ వెంటనే ఇళ్ల పనులు మొదలుపెట్టాలని, లేని పక్షంలో మంజూరు పత్రాలను రద్దు చేసి వేరే వారికి ఇండ్లు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. కేవలం గిరిజనుల కోసమే తాను సీఎం రేవంత్(CM Revanth)తో మాట్లాడి 500 అదనపు ఇండ్లు మంజూరు చేయించానని చెప్పారు. గిరిజనులు శాశ్వత నీడ పొందేందుకు సహకరిస్తున్నామని పేర్కొన్నారు. మండలంలోని పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ వినోద్, మండల అధ్యక్షురాలు & సర్పంచ్ లావణ్య, సర్పంచ్‌లు ఒడ్డేటి నాగమణి, రాచర్ల రజిని, సంతోష్, రాందాస్, మానేపల్లి శ్రీను, సవంతబాయి, ఉప సర్పంచ్‌లు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Harish Palvai | ఇండ్ల మంజూరు పత్రాల అందజేత
By Aadab Desk
- Advertisement -
Previous article
Next article

