Saturday, February 28, 2026
Homeకరీంనగర్ఎన్నికల విధుల్లో..సింగరేణి సిబ్బందిని 'ఆన్ డ్యూటీ'గా పరిగణించండి

ఎన్నికల విధుల్లో..సింగరేణి సిబ్బందిని ‘ఆన్ డ్యూటీ’గా పరిగణించండి

  • బీఎంఎస్ డిమాండ్

గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే సింగరేణి ఉద్యోగులను ఆన్ డ్యూటీ గా పరిగణించాలని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (బీఎంఎస్) అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.ఈ మేరకు రామగుండం ఏరియా-I జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ కు బీఎంఎస్ నాయకులు వినతి పత్రం సమర్పించారు.గతంలో జరిగిన ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల విధుల్లో పాల్గొన్న సింగరేణి సిబ్బందికి ఆ రోజులను మస్టర్లలో కలపకపోవడం వల్ల క్వార్టర్లీ బోనస్,లాభాల వాటా,లీవ్స్ వంటి ఆర్థిక ప్రయోజనాలలో తీవ్ర నష్టాన్ని చవిచూశారని యాదగిరి సత్తయ్య వివరించారు.

ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికల డ్యూటీలలో పనిచేసే సిబ్బందికి ఎలాంటి ఆర్థిక నష్టం కలగకుండా వెంటనే ఆన్ డ్యూటీగా ప్రకటించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఏరియా ఉపాధ్యక్షులు కర్రావుల మహేష్,చెన్న సతీష్,భూమయ్య,అజయ్,రమేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News