సొంత డబ్బుతో వాటర్ హిటర్, లైబ్రరీ ఏర్పాటు చేస్తానని హామీ
సిద్దిపేట ఎమ్మెల్యే(Siddipet Mla) హరీష్‌రావు.. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్‌పల్లి గురుకుల పాఠశాలలో 650 మంది విద్యార్థులకు బ్లాంకెట్లను పంపిణీ (Distribution of Blankets) చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2004లో యువజన శాఖ మంత్రిగా, సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ గురుకుల పాఠశాలను సిద్ధిపేటకు తీసుకువచ్చానని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రూ.14 కోట్లతో పక్కా బిల్డింగ్ నిర్మించామని తెలిపారు. ‘ఈ స్కూల్ నుంచి ఇప్పుడు ఇంజనీర్లు, డాక్టర్లు అవుతున్నందుకు సంతోషంగా ఉంది. 4 నెలల నుంచి విద్యార్థులకు కాస్మెటిక్స్ ఛార్జీలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిసింది.
కాస్మెటిక్స్ ఛార్జీల(Cosmetics Charges)పై ఆర్థిక మంత్రితో మాట్లాడి వచ్చేలా చూస్తా. మీ నుంచి ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఒక పబ్లిక్ సర్వేంట్ కావాలని నా కోరిక. తెలంగాణ రాకముందు ఒకటీ రెండు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. తెలంగాణ వచ్చాక 34 జిల్లాలకు 34 కాలేజీలను మంజూరు చేశాం. 2850 ఉన్న ఎంబీబీఎస్ సీట్లను 10 వేలకు పెంచాం. మీ రెసిడెన్షియల్ స్కూల్ అంటే నాకు ఎంతో ప్రేమ. త్వరలోనే మీకు నా సొంత డబ్బుతో వాటర్ హిటర్, లైబ్రరీ(Water Heater, Library) ఏర్పాటు చేస్తా’ అని హరీష్‌రావు హామీ ఇచ్చారు.
