Monday, October 27, 2025
ePaper
Homeక్రైమ్ వార్తలుకీచ‌క ఎస్సై.. లైంగిక వేధింపులు

కీచ‌క ఎస్సై.. లైంగిక వేధింపులు

మహిళ ఫిర్యాదు నేపథ్యంలో ఎస్సైపై చర్యలు

శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండల పట్నం పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సై రాజశేఖర్‌పై ఒక గిరిజన మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. తన బంధువైన మరో మహిళ విడాకుల కేసులో భరణం విషయంలో సహాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లినట్లు తెలిపింది. ఫిర్యాదు ప్రకారం, ఎస్సై రాజశేఖర్ తనతో అనుచిత ప్రవర్తన చేశాడని, మొబైల్‌ ద్వారా అసభ్య వీడియో కాల్స్ చేశాడని ఆరోపించింది. అలాగే, తనపై ఒత్తిడి తెచ్చే విధంగా పలు సార్లు వ్యక్తిగతంగా వెంబడించాడని తెలిపింది. ఈ ఘటనలలో ఒక వీడియోను సంబంధిత ఆధారంగా సమర్పించినట్లు సమాచారం. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో, జిల్లా ఎస్పీ, ఎస్సై రాజశేఖర్‌ను వెకేషన్ రిజర్వ్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కేసుపై సమగ్ర విచారణ జరపాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. విచారణ ఫలితాల ఆధారంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News