Saturday, March 21, 2026
Homeహైదరాబాద్‌Award | తెలంగాణలో ఉత్తమ ప్రీమియం ప్లాట్ డెవలపర్

Award | తెలంగాణలో ఉత్తమ ప్రీమియం ప్లాట్ డెవలపర్

  • శ్రీ కుశా వెంచర్స్

తెలంగాణ రాష్ట్రంలో ప్రీమియం ప్లాట్ డెవలప్‌మెంట్ రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న శ్రీ కుశా వెంచర్స్ సంస్థకు ప్రతిష్టాత్మక గుర్తింపు లభించిందని సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ ప్రసన్న కుమార్ బల్లిపాగు తెలిపారు. 2026 సంవత్సరానికి నిర్వహించిన య వాల్వింగ్ సౌత్ ఇండియా బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్ స్ కార్యక్రమంలో తెలంగాణలోని “బెస్ట్ ప్రీమియం ప్లాట్ డెవలప్‌మెంట్ కంపెనీ” విభాగంలో సంస్థ నామినేట్ కావడం పట్ల ఆయన హర్షాన్ని ప్రకటించారు.

ఈ అవార్డు వేడుక ఫిబ్రవరి 21, 2026న బెంగళూరులోని రామదా బై వింధమ్ ఎలహంకా లో ఘనంగా జరిగిందన్నారు ఈ కార్యక్రమానికి ఒలింపిక్ పతక విజేత, మాజీ ప్రపంచ నెంబర్ వన్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారన్నారు. తమ కస్టమర్ల విశ్వాసం, ఉద్యోగుల కృషి వల్లే ఈ గుర్తింపు సాధ్యమైందన్నారు.నాణ్యత, పారదర్శకత, విశ్వసనీయత తమ సంస్థ ప్రధాన లక్ష్యాలని తెలిపారు.

- Advertisement -

భవిష్యత్తులో కూడా మరింత మెరుగైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉంటాము” అని తెలిపారు. తెలంగాణలో నాణ్యమైన లేఅవుట్లు, న్యాయపరమైన స్పష్టత, భవిష్యత్ విలువ కలిగిన ప్రాజెక్టులతో సంస్థ విశ్వాసాన్ని సంపాదించిందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ నామినేషన్ సంస్థకు గౌరవప్రదమైన మైలురాయిగా నిలిచిందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News