Saturday, October 4, 2025
ePaper
Homeతెలంగాణతిమ్మాపురంలో బయటపడ్డ పురాతన శివలింగం

తిమ్మాపురంలో బయటపడ్డ పురాతన శివలింగం

  • శివలింగంతో పాటు నాగుపడిగా ఉన్న విగ్రహాలు లభ్యం
  • ఆ శివలింగానికి పెద్ద ఎత్తున పూజలు చేస్తున్న గ్రామస్తులు, భక్తులు

చివ్వెంల మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో సోమవారం రానాబోతు బాధిరెడ్డి వ్యవసాయ భూమిలో బండరాళ్లు తొలగిస్తుండగా శివలింగం, నాగపడిగా విగ్రహాలు బయటపడింది. దీంతో ఒక్కసారిగా షాకు గురయ్యారు. ఊరికి దూరంగా బండల్లో ఉన్న ఈ శివలింగాన్ని, నాగపడిగా విగ్రహాలను వేరే ప్రాంతాలకు తరలిద్దామని గ్రామస్తులు భావించగా ఆ గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలకు ఒంటిమిదికి దేవుడు వచ్చి ఇక్కడినుండి ఎక్కడికి మార్చవద్దని, మాకు గుడి కట్టి పూజలు చేస్తే గ్రామాన్ని ప్రజలను బాగా చూసుకుంటానని చెప్పినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. రణబోతు బాదిరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఈ శివలింగం ప్రత్యక్షం అవడం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో గ్రామస్తులతో పాటు చుట్టుపట్టు గ్రామస్తులు పెద్ద ఎత్తున శివలింగం దర్శనం చేసుకోవడం కోసం తండోపతండాలుగా తిమ్మాపురానికి వస్తున్నారు. రైతు బాదిరెడ్డి తన వేశాక్ క్షేత్రంలో శివలింగం లభ్యమవడం చాలా సంతోషంగా భావిస్తున్నారు. బయటపడ్డ శివలింగాన్ని భక్తులు పెద్ద ఎత్తున పూజలు చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News