ఆంధ్రప్రదేశ్‌కు రావాలని ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు(APCC Chief) వైఎస్ షర్మిల మంగళవారం AICC అగ్రనేత, లోకసభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని ఢిల్లీలోని టెన్ జనపథ్ నివాసంలో కలిశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని(mgnrega) పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో చేపట్టబోయే ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. షర్మిల ఆహ్వానం మేరకు రాహుల్ గాంధీ ఏపీకి వస్తానని చెప్పారు. నరేగా పరిరక్షణ పోరాటంలో భాగస్వామ్యమవుతానని హామీ ఇచ్చారు. 2026 ఫిబ్రవరి 2 నాటికి నరేగా పథకాన్ని ప్రారంభించి 20 ఏళ్లు అవుతుంది. ఈ సందర్భంగా ఆ రోజు నాటి సీఎం YSR నేతృత్వంలో ఉపాధి హామీ పథకాన్ని అమలుచేసిన అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామం నుంచే ప్రస్తుత ఉద్యమం చేపట్టేలా కార్యాచరణను సిద్ధం చేస్తామని షర్మిల పేర్కొన్నారు.
