Saturday, February 28, 2026
Homeక్రైమ్ వార్తలుAirport | శంషాబాద్ విమానాశ్రయంలో విస్తృత తనిఖీలు

Airport | శంషాబాద్ విమానాశ్రయంలో విస్తృత తనిఖీలు

  • 3 కోట్ల ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం
  • ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు..

శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం కావడం కలకలం రేపింది. అబుదాబీ నుండి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద సుమారు 3 కోట్ల రూపాయల విలువైన వస్తువులను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదు పులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిత్యం ప్రయాణీకులతో రద్దీగా ఉండే శంషాబాద్ విమానాశ్ర యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో, అబుదాబీ నుండి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపు లోకి తీసుకున్నారు. వారి లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేసినప్పుడు పెద్ద సంఖ్యలో డ్రోన్లు, ఎలక్ట్రానిక్ స్మార్ట్ వాచ్లు, ఖరీదైన ఐఫోన్లు బయటపడ్డాయి. స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువ సుమారు 3 కోట్లు అని అధికారులు అంచనా వేస్తున్నారు. నిందితులను సూర్య ప్రకాశ్, మహమ్మద్ జాంగిర్ గా గుర్తించారు. ఇంత పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్ పరికరాలను ఎలాంటి పత్రాలు లేకుండా తరలిం చడం పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -

ఈ వస్తువులను ఎక్కడికి తరలిం చడానికి ప్రయత్నించారో, దీని వెనుక ఎవరు ఉన్నారని వివరాలను రాబట్టే పనిలో అధికారులు ఉన్నారు. ఇలాంటి భద్రతా సమస్యలు రాష్ట్ర పోలీసుల అప్రమత్తతను మరింత పెంచాయి. న్యూఢిల్లీ ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటన తర్వాత, దేశంలోని ఐదు ప్రధాన నగరాల్లోని ఎయిర్ పోర్ట్లకు బెదిరింపులు వచ్చాయి. ఆ జాబితాలో హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కూడా ఉంది. ఈ నేప థ్యంలో, నగర పోలీసులు అలర్ట్ అయ్యారు. వివిధ రద్దీ ప్రాంతాల్లో, బస్ స్టాప్లు, దేవాలయాలు, షాపింగ్ మాల్స్లో సోదాలు నిర్వహించారు.

బాలానగర్ పరిధిలోని పలు షాపింగ్ మాల్స్, టెంపుల్స్, బస్ స్టాప్లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. పబ్లిక్ ప్లేసెస్ వద్ద బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టడం వలన రహదారులపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ఘటనల కారణంగా ప్రయాణి కులు, వాహనదారులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ఇండిగో ఎయిర్లైన్స్ కార్యాలయానికి అందిన బెదిరింపు మెయిల్ కారణంగా, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, తిరువనంతపురం ఎయిర్పోర్ట్ బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. ఈ పరిణామాలు భద్రతా కట్టుదిట్టతను మరింత బలపరిచాయి, అధికారులు హైదరాబాద్ విమానాశ్రయంలో నిఘా వ్యవస్థ ఏర్పాటుచేశారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News