- ఉమ్మడి మండలాల మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్.
- అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా భావించే వ్యక్తి ఎమ్మెల్యే.
- చేగూర్ ఉమ్మడి గ్రామాల నుంచి షాద్ నగర్ వరకు వేస్తున్న బిటి రోడ్డు పరిశీలన.
- త్వరలోనే నూతన ప్రభుత్వ భవనాలు అందుబాటులోకి తెస్తాం.
షాద్ నగర్ ఎమ్మెల్యే శంకరన్న మాటల మనిషి కాదని, చెప్పింది వెంటనే అమలుచేసే మనస్తత్వం కలవాడని, అభివృద్ధి ప్రదాత అని నందిగామ,కొత్తూరు ఉమ్మడి మండలాల మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్ పేర్కొన్నారు. నందిగామ మండల పరిధిలోని చేగూర్ ఉమ్మడి గ్రామాల నుంచి షాద్ నగర్ వరకు వేస్తున్న డబుల్ బిటి రోడ్డు పనులను మంగళవారం మండల పార్టీ అధ్యక్షులు జంగ నర్సింలు,చేగూర్ గ్రామం పాలకవర్గంతో కలిసి పరిశీలించారు.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశములో మాజీ ఎంపీపీ మాట్లాడుతూ షాద్ నగర్ నియోజకవర్గంతో పాటు అన్ని గ్రామాల్లో అభివృద్ధి కోసం వందల కోట్ల రూపాయల నిధులను ఎమ్మెల్యే ఖర్చు చేస్తున్నారని అన్నారు.దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలే అన్న చందంగా గ్రామాల అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తూ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావించే మనస్తత్వం గల వ్యక్తి ఎమ్మెల్యే శంకర్ అని స్పష్టం చేశారు.
అందులో భాగంగానే గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారుగా 22కోట్ల రూపాయలతో చేగూర్ ఉమ్మడి గ్రామాల నుంచి షాద్ నగర్ వరకు డబుల్ బిటి రోడ్డును వేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు.నిత్యావసర కోసం రాకపోకలు సాగించే షాద్ నగర్, నందిగామ, శంషాబాద్ వెళ్తుంటాం అన్ని రోడ్లను నిమిషాల్లోనే చేరేలా ఏర్పాటు చేస్తున్నారని అన్నారు.గత 10దేళ్ల పాలనలో మండలం ఏర్పాటు చేశారేతప్ప గ్రామాల్లో చేసిన అభివృద్ధి అంతంత మాత్రమేనని అన్నారు.
ప్రభుత్వం కార్యాలయాలు కూడా అద్దె భవనాల్లోనే కొనసాగాయని ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ పాలనలోనే అభివృద్ధి సాధ్యమని, నూతన ప్రభుత్వ కార్యాలయాల భవనాలు ఎమ్మెల్యే సహకారంతో త్వరలోనే ప్రారంభం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.మీకు చేయాల్సిన అభివృద్ధి, సమస్యలపై చెప్పండి నేనున్నా అంటూ అభివృద్ధిపై తక్షణమే నిధులు,ప్రొసీడింగ్ అందిస్తున్నారంటే అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఎమ్మెల్యే పని చేస్తున్నారని చెప్పడానికి నిదర్శనమన్నారు.
గతంలో అభివృద్ధి అంటే సిద్దిపేట,సిరిసిల్ల మాత్రమే అనేవారని ఇంకో రెండేళ్లలో షాద్ నగర్ కూడ అభివృద్ధిలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు మంకాల శ్రీశైలం,బుగ్గ సాలయ్య,ఉప సర్పంచ్ ఆవుల శివశంకర్,మాజీ ఎంపిటిసిలు కుమారస్వామి,శేఖర్ గౌడ్,యూత్ కాంగ్రెస్ అద్యక్షులు వెంకట్ చారి,నాయకులు బుయ్యని వీరేందర్ గౌడ్,కావలి కృష్ణ,పసుల బుచ్చయ్య,జినుగుంట్ల నవీన్ గౌడ్,పెబ్బే శ్రీశైలం,భాస్కర్ గౌడ్,సతీష్,శ్రీనివాస్ గౌడ్,వెంకట్ తదితరులు పాల్గొన్నారు…
