వైఎస్సార్సీపీ కి మరో షాక్, వైఎస్సార్సీపీ కి వలస దెబ్బలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రెడ్డి వైఎస్సార్సీపీ ని వదిలి తెలుగు దేశం పార్టీలో చేరనున్నారు. మార్చిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొచ్చిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు మర్రి రాజశేఖర్ తెలుగుదేశం పార్టీ లో చేరాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం సాయంత్రం పార్టీ అధ్యక్షుడు మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో
అధికారికంగా టిడిపిలో చేరనున్నారు. మార్చిలో జరిగిన శాసనసభ సమావేశాల చివరి రోజున, వైఎస్ఆర్సిపి పార్టీకి మరియు శాసనమండలి రెండింటికీ రాజశేఖర్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని ఆయన కౌన్సిల్ చైర్మన్ కొయ్యే మోషేను రాజును అభ్యర్థించారు. అయితే, కౌన్సిల్ నుండి ఆయన రాజీనామాకు ఆమోదం రాలేదు.
2014 లో చిలకలూరి పేట నుండి వైఎస్సార్సీపీ అభ్యర్థి గా పోటీ చేసిన మర్రి రాజశేఖర్ తెలుగు దేశం కి చెందిన ప్రత్తిపాటి పుల్లారావు చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన ఉమ్మడి గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. 2019 లో వైస్సార్సీపీ పార్టీ ఆయనను కాదని చిలకలూరిపేట టికెట్ విడదల రజని కి ఇవ్వడం జరిగింది. 2023 లో ఆయన ఎమ్మెల్సీగా ఎన్నిక ఆయారు. మంత్రి పదవి ఆశించిన ఆయనకు నిరాశే దక్కింది. పార్టీ విధానాల పట్ల అసంతృప్తి, విడదల రజని తో విభేదాలు ఆయన పార్టీ నుంచి బయటికి రావడానికి కారణాలు అయ్యాయి.