జవహర్ నగర్ కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ నాగేంద్రబాబు మంగళవారం జనసేన పార్టీలో చేరారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో నిర్వహించిన జనసేన పార్టీ నాయకుల సమావేశంలో ఆయన అధికారికంగా పార్టీలో చేరారు. ఈ సమావేశానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ జనసేన రాష్ట్ర ఇంచార్జ్ శంకర్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రగతి బాటలో నడిపిస్తున్నాయని అన్నారు. తెలంగాణలో కూడా రానున్న మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నాగేంద్రబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు తెలంగాణ రాష్ట్రానికి అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ నాయకత్వంతోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ప్రజలంతా పవన్ కళ్యాణ్ కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల వైపు దృష్టి సారించి స్థానిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నాగేంద్రబాబుతో పాటు సుమారు 50 మంది జనసేన పార్టీలో చేరడం విశేషం.
