జాతీయ న్యాయ సేవాధికార సంస్థ(National Judicial Service Commission) ఆదేశాలకు అనుగుణంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్‌ఛార్జ్ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.రాణి జిల్లా కారాగారాన్ని(Karimnagar District Jail) సందర్శించి ఖైదీలకు అందుతున్న సేవలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విచారణ ఖైదీలతో మాట్లాడుతూ.. డబ్బుపై వ్యామోహంతో గంజాయి సేవించినా, అమ్మినా, కలిగి ఉన్నా.. కఠిన శిక్షలు పడతాయని చెప్పారు. నేరాలకు అలవాటుపడకూడదని సూచించారు. విచారణ ఖైదీలు జిల్లా కారాగారాన్ని పరివర్తన కేంద్రంగా భావించాలని, జైలులో గడిపిన కాలంలో సత్ప్రవర్తనతో మెలిగి బయటకు వెళ్లిన తర్వాత క్షణికావేశానికి లోను కాకుండా ఉండాలని అన్నారు. ఎలాంటి న్యాయ సహాయం కావాలన్నా కారాగారాన్ని సందర్శించే న్యాయవాదులను సంప్రదించి ఉచిత న్యాయ సహాయం పొందాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జితోపాటు లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేష్, జైలర్ శ్రీనివాస్, కారాగార సిబ్బంది పాల్గొన్నారు.
Senior Civil Judge | జిల్లా జైలును పరిశీలించిన సీనియర్ సివిల్ జడ్జ్
By Aadab Desk
- Advertisement -
Previous article
Next article
