Tuesday, February 10, 2026
HomeతెలంగాణMedaram | మొక్కులు చెల్లించుకున్న మంత్రి సీతక్క

Medaram | మొక్కులు చెల్లించుకున్న మంత్రి సీతక్క

పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క(Minister Seethakka) శుక్రవారం మేడారంలోని సమ్మక్క సారలమ్మ(Sammakka Saralamma)కు మొక్కులు సమర్పించారు. గద్దెలపై కొలువైన సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు(Special Puja) చేశారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం.. జాతరకు వచ్చిన భక్తులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు(Talk with devotees). ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మేడారం మహాజాతర తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకని చెప్పారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News