Friday, October 3, 2025
ePaper
Homeఆంధ్రప్రదేశ్జగన్‌ని చూస్తే నవ్వొస్తోంది: లోకేష్

జగన్‌ని చూస్తే నవ్వొస్తోంది: లోకేష్

మాజీ సీఎం వైఎస్ జగన్ కపటత్వం చూస్తుంటే తనకు నవ్వొస్తోందని మంత్రి లోకేష్ అన్నారు. తనకు కాలేజీ లైఫ్‌ ఉంటే జగన్‌కి కారాగార జీవితం ఉందని, తనకు క్లాస్‌మేట్లు ఉంటే జగన్‌కి జైల్‌మేట్లు ఉన్నారని ఎక్స్‌లో ఎద్దేవా చేశారు. గతంలో వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఫొటోలను తన ట్వీట్‌కి ట్యాగ్ చేశారు. జగన్‌ ఐదేళ్ల పదవీకాలం రాజకీయ ప్రతీకార చర్యలకు వేదికగా నిలిచిందని లోకేష్‌ విమర్శించారు.

మహిళల పైన, దళితుల పైన అనేక దాష్టీకాలకు జగన్‌ పాలన నిదర్శనమని ఆరోపించారు. నాడు ఎవరు గళమెత్తినా వారిపై అక్రమ కేసులు బనాయించి రాష్ట్రాన్ని పోలీసు రాజ్యాంగా మార్చారని లోకేష్‌ మండిపడ్డారు. మీ హయాంలో జరిగిన దుశ్చర్యలకు మమ్మల్ని బాధ్యులను చేయాలనుకోవడం, నాటి తప్పులను నేటికీ కవర్ చేసుకోవాలనుకోవడం ఇకనైనా మానుకోవాలని లోకేష్‌.. జగన్‌కి హితవు పలికారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News