Thursday, February 12, 2026
Homeఖమ్మంSandra | బీఆర్ఎస్ పార్టీ నాయకులతో సమావేశం

Sandra | బీఆర్ఎస్ పార్టీ నాయకులతో సమావేశం

సత్తుపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే(Sattupalli Former Mla) సండ్ర వెంకటవీరయ్య(Sandra Venkata Veeraiah) ఇవాళ సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల(BRS Party Leaders)తో సమావేశమయ్యారు. గ్రామ పంచాయతీ ఎన్నికల (Gram Panchayat Elections) నేపథ్యంలో పార్టీ బలపరుస్తున్న అభ్యర్థుల విజయావకాశాలను మెరుగుపరిచేందుకు సలహాలు సూచనలు (Suggestions) ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ (Congress Party) ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతున్న తీరును ఓటర్లకు వివరించాలని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తున్న అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. కాంగ్రెస్ పార్టీ హామీలను సరిగా అమలుచేయాలంటే ప్రతిపక్షం బలంగా ఉండాలని, అప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News