Sunday, October 26, 2025
ePaper
Homeఆదాబ్ ప్రత్యేకంSarvotham Reddy | ‘ఉత్తమ్’ బాటలో సర్వోత్తమ్

Sarvotham Reddy | ‘ఉత్తమ్’ బాటలో సర్వోత్తమ్

పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఉద్యోగ మేళా సక్సెస్
కార్యక్రమ బాధ్యతలు సర్వోత్తమ్ రెడ్డికి అప్పగింత
వేల మందికి ఉపాధి అవకాశాలు

“హుజూర్ నగర్ (Huzur Nagar) నియోజకవర్గ ప్రజానాయకుడు, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) నేతృత్వంలో రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి (Sarvotham Reddy) రాజకీయ ప్రస్థానం (Political Journey) బలపడుతోంది. యువత(Youth)కు అవకాశాలు కల్పించి వారిలో నైపుణ్యాన్ని పెంపొందించాలనే ఉత్తమ్ సదుద్దేశాన్ని సర్వోత్తమ్ తన ఆచరణలో ప్రతిబింబిస్తున్నారు. తండ్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి(Ramreddy Damodar Reddy)తోపాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇస్తున్న ప్రేరణ, మార్గదర్శకత్వం(Guidance)తో సర్వోత్తమ్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుదనం ప్రదర్శిస్తూ ప్రతి కార్యక్రమాన్ని శ్రద్ధగా పర్యవేక్షిస్తున్నారు. యువత పట్ల సర్వోత్తమ్ చూపుతున్న శ్రద్ధను గమనించిన ఉత్తమ్.. మెగా జాబ్ మేళా (Mega Job Mela) బాధ్యతలను ఆయన భుజాలపై వేశారు. తద్వారా సర్వోత్తమ్‌కు నాయకత్వ అనుభవం పెంచే అవకాశం కల్పించారు.

సేవ చేసే మనసు, నేర్చుకోవాలనే ఉత్సాహం ఉన్నవారే భవిష్యత్తు నాయకులు అవుతారని ఉత్తమ్ కుమార్ రెడ్డి విశ్వసిస్తారని, సర్వోత్తమ్ రెడ్డి ఆ నమ్మకాన్ని నెరవేర్చేలా ప్రతి పనిని స్వయంగా ముందుండి చేస్తారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ జాబ్ మేళా విజయవంతమవ్వడం ద్వారా యువ నాయకుడి ప్రజాదరణ మరింత పెరుగుతుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి (టైగర్) పేరు ప్రజల్లో నమ్మకానికి ప్రతీక. రైతుల హక్కుల కోసం అహర్నిశలు పోరాడిన ఆయన వారసత్వాన్ని, ప్రజాసేవా స్ఫూర్తిని తనయుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజల పట్ల ఆత్మీయత, సేవ పట్ల అంకితభావం, యువత పట్ల దృఢమైన నిబద్ధత.. ఇవన్నీ ఆయన నాయకత్వంలో ప్రతిఫలిస్తున్నాయి. తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన పేరు పొందడం యాదృచ్ఛికం కాదు. ఆయన కృషికి వచ్చిన గుర్తింపే అని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

యువత కోసం.. ‘ఉత్తమ్’ కార్యక్రమం…

పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల సహకారంతో హుజూర్ నగర్‌లో మెగా జాబ్ మేళా ఈ నెల 25న విజయవంతంగా ముగిసింది. చదువుకున్న ప్రతి అభ్యర్థికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఈ మేళాను ఏర్పాటుచేశారు. సుమారు 200 జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు పాల్గొనడం విశేషం. పదో తరగతి నుంచి డిగ్రీ, పీజీ స్థాయివారికి కూడా అవకాశాలు లభిస్తుండటంతో యువతలో ఉత్సాహం నెలకొంది. ఇప్పటికే 30,000 మంది యువతీ, యువకులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఈ కార్యక్రమంపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది. ఈ మేళా విజయవంతం కావటం పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సర్వోత్తమ్ పర్యవేక్షణలో జోష్..

జాబ్ మేళా ఏర్పాట్ల బాధ్యతలను రాష్ట్ర యువ కాంగ్రెస్ నాయకుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి భుజాలపై వేసుకున్నారు. రెండు రోజుల ముందుగానే హుజూర్ నగర్ చేరుకొని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. గత మేళాల్లో తలెత్తిన లోపాలను పరిశీలించి ఈసారి అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమగ్ర ప్రణాళిక రూపొందించారు. ప్రతి అభ్యర్థికీ రాకపోకలు, వసతి, భోజనం, సలహా కేంద్రాలు, కంపెనీ కౌంటర్ అన్నింటినీ నిశితంగా పరిశీలించి, పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి పని వెనక ఆయన సమర్పణ, దూరదృష్టి కనిపిస్తోందని నిర్వాహకులు చెబుతున్నారు.

“ఒక ఉద్యోగం కేవలం ఉపాధి కాదు, కుటుంబానికి వెలుగు, ఆత్మగౌరవానికి మూలం. ఈ అవకాశాన్ని ప్రతి యువకుడు వినియోగించుకోవాలి’ అని సర్వోత్తమ్ రెడ్డి యువతను ఉత్సాహపరిచారు. యువతతో నేరుగా సంభాషిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారాల దిశగా అడుగులు వేస్తున్నారు. ఆయన మాట్లాడే ప్రతి మాటలో విశ్వాసం, ప్రతి చర్యలో ప్రజాసేవ స్ఫూర్తి కనిపిస్తోంది.

కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం

సర్వోత్తమ్ రెడ్డి ప్రవేశంతో కాంగ్రెస్ యువతలో కొత్త ఊపు వచ్చిందని పార్టీ కార్యకర్తలు అంటున్నారు. యువతతో కలసి నడవడం, వారికి అవకాశం ఇవ్వడం, ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించడం ఆయన ప్రత్యేకత. హజూర్ నగర్‌లో జరుగుతున్న ఈ మేళా ఆయన ప్రజా నాయకత్వానికి పరీక్ష మాత్రమే కాదు.. విజయోత్సవానికి ఆరంభమని స్థానిక నేతలు అంటున్నారు

తండ్రి వారసత్వం.. తనయుడి విశ్వాసం

రైతుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన టైగర్ దామోదర్ రెడ్డి విలువలు, ప్రజా సేవ, నిబద్ధత, ధైర్యం.. ఇవన్నీ సర్వోత్తమ్ రెడ్డి జీవన విధానంలో ప్రతిబింబిస్తున్నాయి. తండ్రి బాటలోనే ప్రజల బాటలో నడుస్తూ యువత భవిష్యత్తుకు వెలుగు చూపుతున్నారు. కృషి, క్రమశిక్షణ, కట్టుబాటు ఈ యువ నాయకుడిని ప్రత్యేకంగా నిలబెట్టాయి.

హుజూర్ నగర్‌లో “ఉత్తమ” ఉత్సవం

ప్రస్తుతం హుజూర్ నగర్ అంతా ఒక ఉత్సాహ వాతావరణంలో ఉంది. కంపెనీల స్టాల్స్, రిజిస్ట్రేషన్ కౌంటర్లు, హెల్ప్ డెస్క్‌లు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. యువత కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో రూపొందుతున్న ఈ మేళా కేవలం ఉపాధి వేదిక కాదు.. భవిష్యత్తు వైపు వేసిన ఆశా అడుగు. ఆయన తపన, దృష్టి, దార్శనికతతో కాంగ్రెస్ యూత్‌లో కొత్త శక్తి, ప్రజల్లో కొత్త విశ్వాసం నింపుతున్నారు. ఇదిలా ఉంటే సర్వోత్తమ్ రెడ్డి ఉన్నంతకాలం యువత భవిష్యత్తు సురక్షితమని, తండ్రి లాగే తపన, మరింత చురుకుదనం ఆయనలో ఉందని స్థానిక కాంగ్రెస్ నాయకులు వేనోళ్ల ప్రశంసిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News