Tuesday, March 3, 2026
Homeరంగారెడ్డిDonation | భక్తి భావాన్ని అలవరచుకోవాలి.

Donation | భక్తి భావాన్ని అలవరచుకోవాలి.

  • సర్పంచ్ ముడావత్ గబ్రు చౌహన్.
  • అనంత పద్మనాభస్వామి దేవాలయానికి 5లక్షల విరాళం.

ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని అలవరచుకోవాలని సర్పంచ్ ముడావత్ గబ్రు చౌహన్ సూచించారు. కొత్తూరు మండలము పెంజర్ల గ్రామంలోని స్వయంభు శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయము నూతన రాజగోపుర నిర్మాణానికి, నందిగామ మండల పరిధిలోని చాకలిదానిగుట్ట తాండ సర్పంచ్ ముడావత్ గబ్రు చౌహాన్ రూ. 5లక్షలను విరాళం ప్రకటించారు.ఈ సందర్భంగా సర్పంచ్ గబ్రు చౌహాన్ మాట్లాడుతూ స్వయంభు శ్రీ అనంతపద్మనాభ స్వామికి ఎన్నో మహిమలున్నాయని, ఏకాగ్రతతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేర్చే దేవుడని, ఆ దేవాలయ అభివృద్ధిలో భాగస్వామినవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు.ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని అలవరచుకోవాలని కోరారు.అనంతరం మాజీ జెడ్పిటిసి మామిడి శ్యామ్ సుందర్ రెడ్డి, సర్పంచ్ ని శాలువలతో సన్మానించి అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News