- ముఖ్య అతిథి గ్రామ సర్పంచ్ శ్రీలత దేవేందర్.
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అనంతారం గ్రామంలోని గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో సంతూరు కంపెనీ సహకారంతో మంగళవారం ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ తౌటి శ్రీలత దేవేందర్ (మాజీ సర్పంచ్) పాల్గొని ముగ్గుల పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వెంకటేశ్వర ఏజెన్సీస్ బుస రాజు, జె.ఎస్ ఓ సల్మాన్, ఐ.ఎస్.ఆర్ దిలీప్ లతోపాటు కార్యదర్శి దివ్య పాల్గొని ముగ్గుల పోటీలను విజయవంతం చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రథమ బహుమతి మొగుళ్ళ శ్రీవాణి, ద్వితీయ బహుమతి వడిచర్ల వైష్ణవి, తృతీయ బహుమతి సంగ వాణి లకు అందించగా! పాల్గొన్న ప్రతి ఒక్క మహిళలకు కన్సోలేషన్ బహుమతి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి సంతూర్ కంపెనీ తరఫున ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గ్రామస్తులు మహిళలు యువతీ యువకులు పాల్గొన్నారు.


