- హరితహారం చెట్లను స్వయాన దగ్గర ఉండి మరి నరికేసిన సానిటరీ ఇన్స్పెక్టర్
- ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు…!
- చెట్లను నాటమన్నది ప్రభుత్వం నరుక్కోమన్నది ఎవరు
- పదవీ విరమణ పొందిన అధికారికే సిద్దిపేటలో బాధ్యతలు
- విచిత్ర మున్సిపాలిటీ !
- అక్రమాలకు అలవాటు పడిన అధికారుల మౌనం పచ్చదనంపై ముప్పు…!
సిద్దిపేట జిల్లా కేంద్రంలో హరితహారం పేరుతో కోట్ల రూపాయలు వెచ్చించి నాటి చెటు… ప్రజల పన్ను డబ్బుతో పెంచిన పచ్చని ఊపిరి ఇవన్నీ క్షణాల్లో కత్తికి బలైపోయాయి. సిద్దిపేట పట్టణంలో పర్యావరణానికి శత్రువుల్లా వ్యవహరించిన మున్సిపల్ సిబ్బంది చేసిన దారుణం ప్రజల్లో ఆగ్రహాన్ని రగిలిస్తోంది. తాజాగా సిద్దిపేట మున్సిపాలిటీలో సానిటరీ ఇన్స్పెక్టర్ ఎటువంటి అనుమతి లేకుండా, దగ్గరుండి వేర్లతో సహా హరితహారం చెట్లను తొలగించడం పెద్ద వివాదంగా మారింది.

ప్రజల కష్టార్జిత పన్ను డబ్బుతో నాటి మొక్కలను తానే స్వయంగా నేలమట్టం చేయడం పర్యావరణ హననమేనని స్థానికులు మండిపడుతున్నారు. ప్రజల ప్రశ్నలకు సమాధానంగా కొంతమంది అధికారులు విద్యుత్ శాఖపై బాధ్యత నెట్టేయడం మరో సంచలన మైంది.
“చెట్లు విద్యుత్ లైన్లకు అడ్డం అవుతాయని విద్యుత్ అధికారులు తొలగించారు” అన్న తప్పుడు వాదనతో తప్పిం చుకునే ప్రయత్నం చేస్తుండటం ప్రజల ఆగ్రహాన్ని మరింత రెచ్చ గొడుతోంది.ఇక మరొక షాకింగ్ అంశం -పదవీ విరమణ పొందిన అధికారికే మళ్లీ బాధ్యతలు అప్పగించడం. “సిద్దిపేటకు నిజంగా సానిటరీ ఇన్స్పెక్టర్ కరువా” అనే ప్రశ్నలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఒకవైపు పచ్చదనం కోసం హరితహారం నినాదం, మరోవైపు చెట్లను నరికి వేసిన అధికారుల పనితీరు పర్యావరణ పరిరక్షణను ఎగతాళి చేస్తోంది.
దీనిపై ఉన్నతాధికారుల మౌనం కూడా అనుమానాస్పదమే. “చెట్లను నాట మన్నది ప్రభుత్వం… నరుక్కో – పౌరులు, పర్యావరణ ప్రేమి మన్నది ఎవరు” అని కులు ప్రశ్నిస్తు న్నారు. వీరి బుకాయింపులు స్పష్టంగా అవినీతి, అక్రమా లకు అలవాటు పడిన అధికారుల మానసికతను బయట పెడుతు న్నాయని స్థానికులు ఆరోపి స్తున్నారు. చివరికి ఇది పర్యావరణంపై పెద్ద దెబ్బ, ప్రజల పన్నులపై దాడి కాదా అని సిద్దిపేటలో చర్చనీయాంశంగా మారింది.