అబ్దుల్లాపూర్ మెట్టు మండలం, తారామతిపేట గ్రామ వాసి, జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారుడు సానేం అరుణ్ గౌడ్ మరో రెండు రోజుల్లో గుజరాత్ లో జరగబోయే 73వ సీనియర్ నేషనల్ కబడ్డీ తెలంగాణ జట్టుకు ఎంపిక అయినందుకు తాజా మాజీ సర్పంచ్ మూల మహేష్ గౌడ్ నగదు రూపం లో ప్రోత్సహిస్తూ సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వడ్డేపల్లి పాపయ్య గౌడ్, మాజి సర్పంచ్ వడ్డేపల్లి సతీష్ గౌడ్, దుబ్బ మహీంద్రా, ఏరుకలి హర్షవర్దన, సీనియర్ జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారులు సుర్వి కిషోర్ గౌడ్, బొడిగే శ్రీధర్, గ్రామ యువకులు పాల్గొనడం జరిగింది.

- Advertisement -
